Corona in India: దేశంలో 15 వేలు దాటిన యాక్టివ్ కేసులు: వరుసగా ఐదో రోజు రెండు వేలకు పైగా కేసులు

గడిచిన 24 గంటల్లో(శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు) దేశంలో కొత్తగా 2593 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయింది.

Corona in India: దేశంలో 15 వేలు దాటిన యాక్టివ్ కేసులు: వరుసగా ఐదో రోజు రెండు వేలకు పైగా కేసులు

Corona

Updated On : April 24, 2022 / 10:08 AM IST

Corona in India: కరోనా మహమ్మారి పీడ ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా, యూరోప్, ఆసియ ఖండాల్లోని పలు దేశాల్లో కరోనా వ్యాప్తి నాలుగో దశ కొనసాగుతుంది. వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇటు భారత్ లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. గత ఐదు రోజులుగా దేశంలో నిత్యం రెండు వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక గడిచిన 24 గంటల్లో(శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు) దేశంలో కొత్తగా 2593 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయింది. మహమ్మారి భారినపడి 44 మంది మృతి చెందారు. 1755 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,19,479కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 15,873 యక్టీవ్ కేసులు ఉండగా..క్రియాశీలక శాతం 0.04కి చేరుకుంది.

Also read:PM Modi in JandK: ఆర్టికల్ 370 రద్దు అనంతరం మొదటిసారి జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటన

రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ఇండియాలో ఇప్పటివరకు 4,30,57,545 కరోనా కేసులు నమోదు కాగా, 5,22,193 మరణాలు సంభవించాయి. మరో వైపు కోవిడ్ – 19 నియంత్రణ కోసం దేశంలో వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతుంది. భారత్ లో గత 464 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 187.67 కోట్ల డోసుల టీకాలు పంపిణీ చేశారు. శనివారం ఒక్కరోజే 19,05,374 డోసుల టీకాలు పంపిణీ చేశారు. ఒక వేళ భారత్ లోనూ కరోనా నాలుగో దశ సంకేతాలు ఉంటే..వ్యాక్సిన్ పంపిణీ పై ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Also Read:AP Schools Summer Holidays : ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే..

మరోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 27న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, నాలుగో దశ ప్రభావం, వ్యాక్సినేషన్, సహా కోవిడ్ నియంత్రణ చర్యలపై మోదీ ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సైతం ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని..పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.