వ్యాక్సిన్ వేసుకున్న 20రోజులకే కరోనా

వ్యాక్సిన్ వేసుకున్న 20రోజులకే కరోనా

Corona-Vaccination

Corona Vaccination:వ్యాక్సిన్ తీసుకున్న వారికి వికటించి ఆరోగ్య సమస్యలు రావడం గురించి ముందుగానే హెచ్చరించారు. కరోనా మహమ్మారితో పోరాడేందుకు నెలల తరబడి శ్రమించి వైద్యులు రెడీ చేసిన వ్యాక్సిన్ తొలి దశ పంపిణీలోనే ఉంది. ముందుగా హెల్త్ కేర్ వర్కర్లకు, వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు అని కేటాయించింది ప్రభుత్వం. ఇక వ్యాక్సిన్ వేశాక దాదాపు బయటపడ్డట్లే అని ఫీలవడానికి లేదనిపిస్తోంది ఈ ఘటన.

వ్యాక్సిన్ వేసుకున్న 20రోజులకే మెడికల్ టీంలో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో 8 మందికి మంగళవారం కరోనా కన్ఫామ్ అయినట్లు అధికారులు చెప్తున్నారు. 20 రోజుల క్రితం కొవిడ్‌ టీకా తొలి డోసు తీసుకున్నారు. అందులో ఇద్దరు డాక్టర్లు కాగా, ఆరుగురు స్టాఫ్. ఆపరేషన్‌ థియేటర్‌కు సంబంధించిన వారికి . వీరిలో ఆరుగురు కొవిడ్‌ వార్డులో, ముగ్గురు హోం ఐసొలేషన్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో జాప్యం
పోలీసు స్టాఫ్‌కు కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ జరపడంలో జాప్యం కనిపిస్తుంది. మరో రెండ్రోజుల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉండగా.. 40 శాతం మందికి కూడా వ్యాక్సినేషన్ చేయలేకపోయారు. స్టాఫ్‌లో అవగాహనపరిచేందుకు పలుచోట్ల ప్రత్యేక అధికారులను నియమించారు.
రాష్ట్రంలో దాదాపు 60 వేల మంది పోలీసు సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. చాలామందికి బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలుండటంతో వ్యాక్సిన్‌ ఎఫెక్ట్‌లు ఉంటాయేమో అనే భయం కనబరుస్తున్నారు.

రాష్ట్రంలో పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీ సిబ్బందిలో 14వేల 638 మందికి మంగళవారం కొవిడ్‌ టీకాను పంపిణీ చేశారు. 389 పంపిణీ కేంద్రాల్లో మంగళవారం 39వేల 756 మందికి టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. 37 శాతం మంది టీకా పొందారు. వీరిలో ఐదుగురు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మంగళవారంతో కలిపి ఇప్పటివరకూ పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీ సిబ్బందిలో మొత్తం 49వేల 998 మంది కొవిడ్‌ టీకాలు అందాయి. మెడికల్ స్టాఫ్ కూడా కలిపితే రాష్ట్రంలో ఇప్పటివరకూ 2లక్షల 43వేల 483 మంది టీకా పొందినట్లు ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు తెలిపారు.