Covid- 19 Cases: ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్.. భారీగా పాజిటివ్ కేసులు.. కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి నాలుగు నుంచి ఐదు రోజులకు రెట్టింపు అవుతోంది. ప్రజలు కరోనా మార్గదర్శకాలు తప్పక పాటించాలని, బూస్టర్ డోస్‌లు తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, కరోనా కొత్త వేరియంట్ XBB.1.16 యొక్క లక్షణాలు మనుపటి మాదిరిగానే ఉన్నాయని, కొత్త లక్షణాలేవీ తెరపైకి రాలేదని వెల్లడించారు.

Covid- 19 Cases: ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్.. భారీగా పాజిటివ్ కేసులు.. కేంద్రం కీలక నిర్ణయం

Covid- 19 Cases

Covid- 19 Cases: దేశంలో మళ్లీ కరోనా వైరస్ (Corona virus) వ్యాప్తి పెరుగుతోంది. నెల రోజులుగా రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత నెల మొదటి వారంలో వెయ్యి నుంచి 2వేల వరకు నమోదైన రోజువారి కేసుల సంఖ్య ప్రస్తుతం 6వేల వరకు చేరాయి. క్రియాశీలక కేసుల సంఖ్య 35వేలు దాటింది. కరోనా మరణాల (Corona deaths) సంఖ్యసైతం రోజురోజుకు పెరుగుతోంది. రోజుకు 10 నుంచి 14 మంది వరకు కరోనా కారణంగా మరణిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. XBB.1.16 వేరియంట్‌ వల్లనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు (Medical professionals) పేర్కొంటున్నారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 38శాతం కొత్త వేరియంట్ XBB.1.16 వల్లనే నని నివేదికలు పేర్కొంటున్నాయి.

Corona Cases : దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 5,676 పాజిటివ్ కేసులు

దేశ వ్యాప్తంగా రోజువారి కొత్త కేసులు 5,500 నుంచి ఆరు వేల వరకు నమోదవుతున్నాయి. వీటిల్లో పలు రాష్ట్రాల్లో అత్యధికంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) ఢిల్లీ (Delhi), మహారాష్ట్రా (Maharashtra) ల్లో భారీగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 980 కొత్త కరోనా కేసులు నమోదు కావటం ఆందోళన కలిగించే విషయం. ఇద్దరు కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. ఢిల్లీలో సంక్రమణ రేటు 25.98శాతంగా నమోదైంది. మంగళవారం ఢిల్లీలో మొత్తం 3,772 పరీక్షలు నిర్వహించారు. దేశ రాజధానిలో భారీ కేసుల సంఖ్య నమోదవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది.

Corona Cases : దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. ఢిల్లీ, కేరళలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

మహారాష్ట్రలోనూ కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మంగళవారం ఆ రాష్ట్రంలో 919 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. సోమవారం మహారాష్ట్రలో కేవలం 328 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. కానీ, మంగళవారం సాయంత్రంకు 591 కొత్తకేసులు అదనంగా నమోదు కావటం ఆ రాష్ట్రంలో కోవిడ్ ఉధృతికి అద్ధం పడుతోంది. యూపీలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజు 402 కొత్త కేసులు నమోదయ్యాయి. యూపీలో పరీక్షలను పెంచాలని ప్రభుత్వం సూచించింది.

Corona Virus : మూడేళ్లైనా కరోనా వైరస్‌ గురించి అంతుచిక్కడం లేదు

ఎపిడెమియాలజిస్టుల ప్రకారం.. భారతదేశంలో కోవిడ్ -19 ప్రతి నాలుగు నుంచి ఐదు రోజులకు రెట్టింపు అవుతోంది. ప్రజలు కరోనా మార్గదర్శకాలు తప్పక పాటించాలని, బూస్టర్ డోస్ లు తీసుకోవాలని వైద్య నిఫుణులు పేర్కొంటున్నారు. అయితే, కరోనా కొత్త వేరియంట్ XBB.1.16 యొక్క లక్షణాలు మనుపటి మాదిరిగానే ఉన్నాయని, కొత్త లక్షణాలేవీ తెరపైకి రాలేదని వైద్య నిఫుణులు పేర్కొంటున్నారు.