Munugode By-Election : రేపే మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు జరుగుగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ పట్టణంలోని అర్జాల భావి లోని తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోదాముల్లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ, కౌంటింగ్‌ హాళ్లలో వసతుల కల్పన పూర్తయ్యాయి.

Munugode By-Election : రేపే మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

munugode by election

Munugode By-Election : నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు జరుగుగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ పట్టణంలోని అర్జాల భావి లోని తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోదాముల్లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ, కౌంటింగ్‌ హాళ్లలో వసతుల కల్పన పూర్తయ్యాయి. కౌంటింగ్ కోసం ఒకే హాల్‌లో మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కింపు జరుగనుంది. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఏడు మండలాల్లో మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాల్లో 298 ఈవీఎంలను వినియోగించారు.

ఉదయం 7 గంటలకు పోలింగ్ ఏజెంట్ లు, అభ్యర్థుల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్ లు ఓపెన్ చేయనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటలోపు పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటగా ఆర్వో టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. మొత్తం 686 బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి.
అనంతరం చౌటుప్పల్ మండలం నుండి ఈవీఎం ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూర్, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్ వరుసగా లెక్కిస్తారు. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు.

Munugode By-Election : ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్

ఉదయం 9 గంటలకు తొలి ఫలితం వెలువడనుంది. గంటకు 3 నుంచి 4 రౌండ్ల ఫలితాలు వెల్లడి కానుండగా, మధ్యాహ్నం 1 వరకు కౌంటింగ్‌ పూర్తై, తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బందికి మూడు దఫాలుగా శిక్షణ పూర్తి చేశారు. కేంద్ర ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి, ఆర్వో పర్యవేక్షణలో కౌంటింగ్ కొనసాగనుంది. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపర్చారు. వీటి వద్ద రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి నేతృత్వంలో లెక్కింపు అధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు.

కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలతో సీసీ కెమెరాల పర్యవేక్షణలో 24 గంటల పాటు పటిష్టమైన భద్రత కొనసాగుతోంది. ప్రతి పార్టీ నుండి చీఫ్ ఏజంట్ సహా ఒక్కో టేబుల్ కు ఒక్కో ఏజంట్ కు అనుమతి ఇచ్చారు. 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(టిఆర్ఎస్), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(బిజెపి), పాల్వాయి స్రవంతి(కాంగ్రెస్), ఆనందాచారీ (బీఎస్పీ) ఉన్నారు. గురువారం(నవంబర్3,2022) మునుగోడు ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 2,41,855 ఓట్లకుగానూ 2,25,192 ఓట్లు (93.16%) పోల్ అయ్యాయి.