Telangana Congress : టీ.కాంగ్రెస్ లో మళ్లీ మొదలైన కోవర్టుల గోల..వార్నింగ్ ఇచ్చిన రాహుల్ గాంధీ | covers Controversy in telangana congress

Telangana Congress : టీ.కాంగ్రెస్ లో మళ్లీ మొదలైన కోవర్టుల గోల..వార్నింగ్ ఇచ్చిన రాహుల్ గాంధీ

తెలంగాణ హస్తం పార్టీలో మళ్లీ కోవర్టుల గోల మొదలైంది. రెండు రోజుల టూర్‌లో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్.. గాంధీభవన్‌లో ఇంకా రీసౌండ్ వస్తూనే ఉన్నాయ్. దీంతో.. టీఆర్ఎస్, బీజేపీతో.. లోలోపల దోస్తీ చేస్తుందెవరు? ఆ రెండు పార్టీల పట్ల.. సాఫ్ట్ కార్నర్ ఉన్నోళ్లెవరు? రాహుల్ ఎవరినుద్దేశించి ఈ కామెంట్స్ చేశారన్న దానిపైనే.. పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది.

Telangana Congress : టీ.కాంగ్రెస్ లో మళ్లీ మొదలైన కోవర్టుల గోల..వార్నింగ్ ఇచ్చిన రాహుల్ గాంధీ

covers Controversy in telangana congress  : తెలంగాణ హస్తం పార్టీలో మళ్లీ కోవర్టుల గోల మొదలైంది. రెండు రోజుల టూర్‌లో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్.. గాంధీభవన్‌లో ఇంకా రీసౌండ్ వస్తూనే ఉన్నాయ్. దీంతో.. టీఆర్ఎస్, బీజేపీతో.. లోలోపల దోస్తీ చేస్తుందెవరు? ఆ రెండు పార్టీల పట్ల.. సాఫ్ట్ కార్నర్ ఉన్నోళ్లెవరు? రాహుల్ ఎవరినుద్దేశించి ఈ కామెంట్స్ చేశారన్న దానిపైనే.. పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది.

ఎండాకాలంలో.. వానలు కురిసి.. వాతావరణం చల్లబడ్డట్లు.. రాహుల్ గాంధీ టూర్.. తెలంగాణ కాంగ్రెస్ నేతలను కూడా కాస్త కూల్ చేసింది. పార్టీలో ఎప్పుడూ కనిపించే పొలిటికల్ హీట్.. ఇప్పుడు చల్లారింది. సీనియర్స్ అంతా.. ఎక్కడి వాళ్లక్కడ సైలెంట్ అయిపోయారు. అంతా.. మౌనంగానే ఉన్నా పార్టీ వర్గాల్లో మాత్రం ఓ చర్చ జోరుగా నడుస్తోంది. వరంగల్ రైతు సంఘర్షణ సభలో, గాంధీభవన్‌లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో.. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌ మీదే.. ఇప్పుడు డిబేట్ అంతా.

Also read : Tomato Flu Virus : కేరళలో టమాటా ఫ్లూ కలకలం..దాదాపు 10 కేసులు నమోదు

టీఆర్ఎస్, బీజేపీతో చనువుగా ఉండే నేతలు.. పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు. ఆ రెండు పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలున్నోళ్లు.. వెంటనే పార్టీ మారొచ్చని.. ప్రకటించారు రాహుల్. అయితే.. కాంగ్రెస్‌లో ఉంటూ.. ఆ రెండు పార్టీలతో సన్నిహితంగా మెలుగుతున్న నేతలెవరన్నదే.. పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్, బీజేపీతో సన్నిహితంగా మెలిగే నాయకులు.. ఇంకా పార్టీలోనే ఉన్నారని.. రాహుల్‌కు తెలిసిపోయిందా? అంత పక్కాగా కామెంట్స్ చేయడానికంటే ముందు.. పక్కా ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు.. ఇంత బహిరంగంగా రాహుల్ చెప్పడం వెనుక కారణమేంటన్న దానిమీదే జోరుగా చర్చ నడుస్తోంది.

పార్టీలో కోవర్టులుంటే.. అంతర్గతంగా హెచ్చరించాలే తప్ప.. ఇలా బహిరంగ వేదికలపై కామెంట్స్ చేయడమేంటని.. కాంగ్రెస్ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. మంచి అందరిలో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలన్న సూత్రాన్ని రాహుల్ ఎందుకు పక్కన పెట్టారన్న దానిమీదే.. డీప్ డిస్కషన్ నడుస్తోంది. పార్టీకి నష్టం చేసే లీడర్లుంటే.. ఆధారాలు బయటపెట్టి.. కొత్త దారులు వెతుక్కోమని.. గాంధీభవన్ లోపల ఖాళీగా ఉన్న ఓ రూములో చెప్పొచ్చు. మాట వినే పరిస్థితి లేకపోతే.. లోపలి నుంచే గేటు చూపించి.. గెంటేయొచ్చు. కానీ.. ఇలా ఓపెన్ కామెంట్స్ చేయడంతో.. పార్టీ పట్ల జనంలో చులకన భావం వస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

Also read : Taj Mahal: తాజ్ మహల్ ఉన్న స్థలం మాదే, షాజహాన్ లాక్కున్నాడు: పత్రాలు కూడా ఉన్నాయన్న బీజేపీ ఎంపీ

రాహుల్ కామెంట్స్‌పై గాంధీభ‌వ‌న్‌లో మ‌రో చ‌ర్చ నడుస్తోంది. రాహుల్ నోటి వెంట.. ఆ కామెంట్స్.. పార్టీలోని ఓ ముఖ్య నేత కావాలనే చేయించారనే టాక్ వినిపిస్తోంది. సదరు నేత.. మొదటి నుంచి పార్టీలో కోవర్టులను ఏరివేస్తానంటూ చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో కొందరిపై కోవర్టు ముద్ర వేయడమన్నీ.. ఆ కోవలోకే వస్తాయని కాంగ్రెస్ శ్రేణులు అనుకుంటున్నాయ్. కావాలనే.. కొందరిపై కోవర్ట్ అనే ముద్ర వేసి.. తాను పొలిటికల్ మైలేజ్ పొందేందుకు స్కెచ్ వేస్తున్నారని భావిస్తున్నారట. ఈ మొత్తం ఎపిసోడ్‌లో.. ఏం జరిగింది? ఏం జరగబోతోందన్న విషయంపై.. కొందరు నేతలు ఫోకస్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. రాహుల్ కామెంట్స్ వెనుక అసలు మర్మమేంటో బయటపడ్డాక.. మౌనం వీడి మళ్లీ మాటల జోరు పెంచాలని చూస్తున్నట్లు.. గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయ్.

×