Covid 19 Death : కరోనాతో మరణించిన కుటుంబాలకు రూ. 50 వేలు..దరఖాస్తుల స్వీకరణ

కరోనా మొదటి, రెండో వేవ్ లో ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి. వేలాదిమంది పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలయ్యారు.

Covid 19 Death : కరోనాతో మరణించిన కుటుంబాలకు రూ. 50 వేలు..దరఖాస్తుల స్వీకరణ

Covid Death

Covid 19 Death : కరోనా వైరస్ ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. భర్తను కోల్పోయి భార్య..తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు…ఇలా చాలా మంది చనిపోయారు. ఆర్థికంగా చాలా మంది చితికిపోయారు. కరోనా మొదటి, రెండో వేవ్ లో ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి. వేలాదిమంది పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలయ్యారు. కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్స్ వినిపించాయి. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Read More : Portugal : డ్యూటీ ముగిసిన తర్వాత వేధించారా..ఫైన్ కట్టాల్సిందే

కరోనా మృతుల కుటుంబాలకు కనీస నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ -19 కు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ .4 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్లను దాఖలయ్యాయి. ఈ క్రమంలో… ప్రతి కరోనా మరణానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో మరణ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తుల ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభమైంది. మీ సేవ ద్వారా..మొదటి రోజే 500కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ..ఈ దరఖాస్తులను పరిశీలించి…కోవిడ్ డెత్ సర్టిఫికేట్లను జారీ చేయనుంది.

Read More : Bigg Boss 5: శ్రీరామ్‌కు సోనూ సపోర్ట్.. టైటిల్ కొట్టడం ఖాయమా?

మృతుల కుటుంబసభ్యులు పంచాయతీ లేదా… మున్సిపాల్టీ నుంచి డెడ్ సర్టిఫికేట్, కోవిడ్ పాజిటివ్ రిపోర్టును దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ రిపోర్టు లేకపోతే..వైరస్ కారణంగా..అడ్మిట్ అయిన ఆసుపత్రి నుంచి మరణాన్ని ధృవపరిచే…మెడికల్ సర్టిఫికేట్ ను జత చేయాలి. ఇది కూడా లేకుంటే…కరోనా చికిత్సలో చేసిన పరీక్షల బిల్లులు..ఇతరత్రా పేపర్లు సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకు అకౌంట్, ధృవపత్రాలతో రూ. 50 వేల పరిహారం కోసం…మీ సేవలో దరఖాస్తు చేయాలి.