Covid-19 In India : ఆ జిల్లాల్లో కర్ఫ్యూ విధించండి..రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దేశంలో రెండు వారాలుగా కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతుండటం, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది.

Covid-19 In India : ఆ జిల్లాల్లో కర్ఫ్యూ విధించండి..రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Covid Tests

Covid-19 In India : దేశంలో రెండు వారాలుగా కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతుండటం, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కోవిడ్ విస్తరిస్తున్న జిల్లాల్లో నైట్ కర్ఫ్యూలు సహా మరిన్ని ఆంక్షలు విధించే విషయమై దృష్టి సారించాలని ఆదేశించింది. పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచడం, కంటోన్మెంట్ జోన్లుగా పరిగణించి అవసరమైతే రాత్రి కర్ఫ్యూలు విధించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున తక్షణ చర్యలపై దృష్టి పెట్టాలంటూ అన్ని రాష్ట్రాల,కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్ లకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. మిజోరాం, కేరళ, సిక్కింలోని 8జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికిపైగా ఉందని, కేరళ, మిజోరాం, అరుణాచల్​ప్రదేశ్​, పుదుచ్చేరి, మణిపుర్​, బంగాల్, నాగాలాండ్​లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10శాతం ఉన్నట్లు రాజేశ్ భూషణ్ తెలిపారు. దీంతో ఈ 27 జిల్లాల్లో కరోనా వ్యాప్తిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.

దేశంలోని ఏదైనా జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువ లేదా 60 శాతం కంటే ఎక్కువ పడకలు నిండిపోవడం జరిగితే.. ఆ జిల్లాలను కంటైన్మెంట్ జోన్​లుగా పరిగిణించాలని రాష్ట్రాలకు రాజేష్ భూషణ్ సూచించారు. రాత్రి కర్ఫ్యూలు, జనసమూహాలను తగ్గించడం, రాజకీయ, సామాజిక, వినోద, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిషేధించడం, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో జనసమూహాన్ని తగ్గించడం వంటి చర్యలను చేపట్టాలని రాజేశ్​ భూషణ్ లేఖలో పేర్కొన్నారు.

ALSO READ Chinese Military Planes : యుద్థవిమానాలతో తైవాన్ పై మరోసారి చైనా బలప్రయోగం