Cricketer Shami wife requests..change India Name: భారతదేశం పేరు మార్చాలని ప్రధాని మోడీని కోరిన క్రికెటర్ మహ్మద్ షమీ భార్య

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భార్య ‘భారతదేశం పేరు మార్చాలి’అని కోరారు. షమీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ, మంత్రి అమిత్ షాను భారతదేశం పేరు మార్చండి అంటూ కోరారు.

Cricketer Shami wife requests..change India Name: భారతదేశం పేరు మార్చాలని ప్రధాని మోడీని కోరిన క్రికెటర్ మహ్మద్ షమీ భార్య

Cricketer Shami wife requests Modi change india name

Updated On : August 16, 2022 / 10:25 AM IST

Cricketer Shami wife requests Modi change india name : భారత దేశం 75 సంవత్సరాల స్వాత్రంత్ర్య దినోతవ్స వేడుకలు జరుకుంటున్న వేళ టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భార్య ‘భారతదేశం పేరు మార్చాలి’అని కోరారు. షమీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ, మంత్రి అమిత్ షాను భారతదేశం పేరు మార్చండి అంటూ కోరారు. భర్త షమీతో వచ్చిన విభేదాలను హసీన్ జహాన్ కొంతకాలంగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

ఇన్ స్టా గ్రామ్ వేదికగా హసీనా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు చేసిన ఈ విన్నపం దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఐ లవ్ భారత్’ అని చెప్పిన ఆమె… మన దేశం పేరును భారత్ గా కానీ, హిందుస్థాన్ గా కానీ మార్చాలని కోరారామెు. మన దేశం మనకు గర్వకారణం,,నేను భారత్ ను ప్రేమిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా హసీనా పేర్కొన్నారు.

హమ్రే దేశ్ కా నేమ్ సిర్ఫ్ హిందుస్థాన్ యా భారత్ హోనా చాహ్యే. పేదే ప్రపంచ హమారే దేశ్ కో భారత్ యా హిందుస్థాన్ కహే నాకీ ఇండియా.”అంటూ పేర్కొన్నారు. దేశం వజ్రోత్సవ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో హసీన్ జహాన్ చేసిన ప్రతిపాదన..పలువురికి ఆసక్తిగా మారింది.