Mumbai: మనీ లాండరింగ్ కేసులో ఈడీ తనిఖీలు.. ఐదున్నర కోట్ల విలువైన నగలు, కోటికిపైగా నగదు స్వాధీనం

ఇటీవల ముంబై, నాగ్‌పూర్‌లోని పలు చోట్ల జరిపిన సోదాల్లో రూ.5.51 కోట్ల విలువైన నగలు, రూ.1.21 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగల్లో ఖరీదైన బంగారు, వజ్రాభరణాలున్నాయి. పంకజ్ మెహదియాతోపాటు, ఇతరులు పెట్టుబడుల పేరుతో వినియోగదారులను మోసం చేసిన కేసులో ఈడీ, సీబీఐ విచారణ కొనసాగిస్తోంది.

Mumbai: మనీ లాండరింగ్ కేసులో ఈడీ తనిఖీలు.. ఐదున్నర కోట్ల విలువైన నగలు, కోటికిపైగా నగదు స్వాధీనం

Mumbai: మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన దాడుల్లో భారీగా నగదు, నగలు పట్టుబడ్డాయి. ఇటీవల ముంబై, నాగ్‌పూర్‌లోని పలు చోట్ల జరిపిన సోదాల్లో రూ.5.51 కోట్ల విలువైన నగలు, రూ.1.21 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Women’s Day: ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు

నగల్లో ఖరీదైన బంగారు, వజ్రాభరణాలున్నాయి. పంకజ్ మెహదియాతోపాటు, ఇతరులు పెట్టుబడుల పేరుతో వినియోగదారులను మోసం చేసిన కేసులో ఈడీ, సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. పంకజ్ నంద్‌లాల్ సహా పలువురు నిందితులు వినియోగదారుల్ని పెట్టుబడుల పేరుతో మోసం చేశారు. 12 శాతం లాభాలు అందజేస్తామని భారీగా వసూలు చేశారు. 2004-2017 వరకు వీరి వ్యాపారం సాగింది. అయితే, లాభాలు ఇవ్వకపోగా పెట్టుబడి కూడా తిరిగి ఇవ్వకుండా చాలా మందిని మోసం చేశారు. దీంతో వీరిపై కేసు నమోదైంది. మొత్తంగా రూ.150 కోట్లు మోసం చేసినట్లు అంచనా.

Bihar: బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి ఇంట్లో సీబీఐ సోదాలు.. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో విచారణ

దీనిపై ప్రస్తుతం ఈడీ విచారణ జరుపుతోంది. నిందితులు, సంస్థకు సంబంధించిన కార్యాలయాలపై దాడులు చేశారు. నాగ్‌పూర్, ముంబైలోని 15 స్థావరాలపై ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో భరీ ఎత్తున నగల్ని, నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు కొన్ని డిజిటల్ డివైజెస్, విలువైన డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.