Bihar: బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి ఇంట్లో సీబీఐ సోదాలు.. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో విచారణ

‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్’ విచారణలో భాగంగా సీబీఐ అధికారులు పాట్నాలోని రబ్రీ దేవి ఇంటికి సోమవారం చేరుకున్నారు. ఆమె తనయుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అసెంబ్లీకి వెళ్లిపోయిన కొద్ది సేపటికే అధికారులు వారి ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. రబ్రీదేవిని విచారిస్తున్నారు.

Bihar: బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి ఇంట్లో సీబీఐ సోదాలు.. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో విచారణ

Bihar: లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్’ విచారణలో భాగంగా సీబీఐ అధికారులు పాట్నాలోని రబ్రీ దేవి ఇంటికి సోమవారం చేరుకున్నారు.

Andhra Pradesh: కొత్తపల్లి మండలంలో కనిపించిన పెద్దపులి పిల్లలు.. జాడ లేని తల్లి పులి.. ఆందోళనలో గ్రామస్తులు

ఆమె తనయుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అసెంబ్లీకి వెళ్లిపోయిన కొద్ది సేపటికే అధికారులు వారి ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. రబ్రీదేవిని విచారిస్తున్నారు. 2004-2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు. అప్పట్లో రైల్వే ఉద్యోగాల పేరుతో కొంత మంది నుంచి అక్రమంగా, తక్కువ ధరలో భూములు తీసుకున్నరనేది ఈ కేసులో ప్రధాన అభియోగం. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌, ఆయన సతీమణి రబ్రీదేవి, వారి కూతురు మిసా భారతితోపాటు మరో 13 మంది రైల్వే ఉన్నతాధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

Nara Lokesh: విశాఖలో జరిగింది గ్లోబల్ సమ్మిట్ కాదు.. లోకల్ ఫేక్ సమ్మిట్.. జగన్ ఇగో తృప్తి కోసమే ..

దీనిపై గత అక్టోబరులో చార్జిషీటు కూడా దాఖలు చేసింది. ఉద్యోగార్థుల నుంచి పొందిన భూములను వీళ్లు తమ పేరు మీద లేదా తమ సమీప బంధువుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సీబీఐ విచారణలో తేలింది. ఈ అభ్యర్థుల్ని రైల్వేలో గ్రూప్-డి ఉద్యోగాల్లో నియమించారు. ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్ వంటి వేర్వేరు జోన్లలో వీరికి ఉద్యోగాలు కేటాయించారు. అనంతరం వీరి నుంచి భూముల్ని లాలూ కుటుంబ సభ్యులు, రైల్వే ఉన్నతాధికారులు తమ పేరున, బినామీ పేర్ల మీద ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.

ఈ భూముల విలువ రూ.కోట్లలోనే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లు కూడా ఫేక్ అని అధికారులు తేల్చారు. దీంతో ఈ కేసు విచారణలో భాగంగా రబ్రీ దేవిని అధికారులు విచారిస్తున్నారు.