Andhra Pradesh: కొత్తపల్లి మండలంలో కనిపించిన పెద్దపులి పిల్లలు.. జాడ లేని తల్లి పులి.. ఆందోళనలో గ్రామస్తులు

ఆదివారం ఉదయం గ్రామంలోని ఒక వ్యక్తి ఈ పులి పిల్లలను చూశాడు. వెంటనే స్థానికులకు, అటవీ అధికారులకు సమాచారం అందించాడు. పెద్దగుమ్మడాపురం చేరుకున్న అటవీ అధికారులు పులి పిల్లలను పరిశీలిస్తున్నారు. అయితే, ఈ పిల్లల తల్లి కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Andhra Pradesh: కొత్తపల్లి మండలంలో కనిపించిన పెద్దపులి పిల్లలు.. జాడ లేని తల్లి పులి.. ఆందోళనలో గ్రామస్తులు

Andhra Pradesh: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం, పెద్దగుమ్మడాపురం అనే గ్రామంలో నాలుగు పెద్దపులి పిల్లలు కనిపించడం సంచలనంగా మారింది. ఆదివారం ఉదయం గ్రామంలోని ఒక వ్యక్తి ఈ పులి పిల్లలను చూశాడు. వెంటనే స్థానికులకు, అటవీ అధికారులకు సమాచారం అందించాడు.

Janhvi Kapoor : #NTR30 అప్డేట్.. అనుకున్నదే అయింది.. ఎన్టీఆర్ సినిమాలో జాన్వీనే హీరోయిన్..

పెద్దగుమ్మడాపురం చేరుకున్న అటవీ అధికారులు పులి పిల్లలను పరిశీలిస్తున్నారు. అయితే, ఈ పిల్లల తల్లి కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తల్లి పులి ఎక్కడుందో అని, తమపై ఎక్కడ దాడి చేస్తుందో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద పులి పిల్లలు రెండు, మూడు రోజుల క్రితమే జన్మించి ఉండొచ్చని అటవీ అధికారులు అంటున్నారు. తల్లి కనిపించకపోవడంతోనే పులి పిల్లలు తమ స్థావరం నుంచి బయటకు వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, తల్లి పులి ఏమైంది? అసలు తల్లి పులి బతికే ఉందా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

Nara Lokesh: విశాఖలో జరిగింది గ్లోబల్ సమ్మిట్ కాదు.. లోకల్ ఫేక్ సమ్మిట్.. జగన్ ఇగో తృప్తి కోసమే ..

పులి పిల్లల్ని కన్నప్పటికీ, దీని గురించి అటవీ అధికారులకు సమాచారం లేకపోవడం, పర్యవేక్షణ కరువవ్వడంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పులి లాంటి అరుదైన జంతువులు గర్భం దాల్చినప్పుడు వాటిని పూర్తి స్థాయిలో అటవీ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయం అధికారులకు తెలియకపోవడంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లి పులికి ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని స్థానికులు అనుమానిస్తున్నారు. పెద్ద పులి వేటకు వెళ్తే, తన పిల్లలను సురక్షిత ప్రాంతంలో పెట్టి ఉంచి వెళ్తుందని అటవీ అధికారులు అంటున్నారు.

ఈ పులి పిల్లలు సాధారణంగా 2-3 సంవత్సరాల వరకు తల్లి సంరక్షణలోనే ఉంటాయి. అందుకే పెద్ద పులి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చాయో.. వాటిని అక్కడే వదిలేయాలని అటవీ అధికారులు భావిస్తున్నారు. పులి పిల్లల ఆరోగ్యాన్ని పరిశీలించిన తర్వాత అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. తల్లి పులి కోసం అన్వేషిస్తున్నారు.