India-Bangladesh: ఇరు దేశాల మ‌ధ్య బ‌స్సు స‌ర్వీసులు మ‌ళ్లీ షురూ

భార‌త్‌, బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దుల‌ మ‌ధ్య బ‌స్సు స‌ర్వీసులు మ‌ళ్లీ ప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా నేప‌థ్యంలో రెండేళ్ల క్రితం ఇరు దేశాల మ‌ధ్య ఈ బ‌స్సు స‌ర్వీసుల‌ను నిలిపేసిన విష‌యం తెలిసిందే.

India-Bangladesh: ఇరు దేశాల మ‌ధ్య బ‌స్సు స‌ర్వీసులు మ‌ళ్లీ షురూ

Bus Service

India-Bangladesh: భార‌త్‌, బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దుల‌ మ‌ధ్య బ‌స్సు స‌ర్వీసులు మ‌ళ్లీ ప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా నేప‌థ్యంలో రెండేళ్ల క్రితం ఇరు దేశాల మ‌ధ్య ఈ బ‌స్సు స‌ర్వీసుల‌ను నిలిపేసిన విష‌యం తెలిసిందే. క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఈ స‌ర్వీసుల‌ను శుక్ర‌వారం నుంచి ప్రారంభించారు. అగ‌ర్త‌లా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-ఆఖావ్డా-హ‌రిదాస్‌పూర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-బేనాపూల్ మ‌ధ్య ఈ బ‌స్సు స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయని బంగ్లాదేశ్‌లోని భార‌త హై క‌మిష‌న్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.

Rajya Sabha Polls: మా పార్టీ నేత‌ల‌ను కొనేందుకు కాంగ్రెస్ బేర‌సారాలు: కుమార‌స్వామి

అలాగే, ఢాకా-కోల్‌క‌తా-ఢాక్ బ‌స్సు స‌ర్వీసు కూడా శుక్ర‌వారం ఉద‌యం నుంచి ప్రారంభ‌మైంద‌ని వివ‌రించింది. భార‌త్‌-బంగ్లాదేశ్ మ‌ధ్య మే 29 నుంచి రైలే స‌ర్వీసు కూడా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఇరు దేశాల మ‌ధ్య రైలు స‌ర్వీసులు క‌రోనా కార‌ణంగా 2020 మార్చి నుంచి నిలిచిపోయాయి. బంధ‌న్ ఎక్స్‌ప్రెస్ కోల్‌క‌తా-ఖుల్నా మ‌ధ్య‌, మైత్రీ ఎక్స్‌ప్రెస్ కోల్‌క‌తా-ఢాక్ మ‌ధ్య స‌ర్వీసులు కొన‌సాగిస్తాయి. బ‌స్సు, రైలు స‌ర్వీసులు పునఃప్రారంభ‌మైన నేప‌థ్యంలో ముఖ్యంగా చిరు వ్యాపారుల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది.