Aryan khan : ఆర్యన్ ఏం చేయబోతున్నాడు? షారుఖ్, గౌరీ ఖాన్‌కు ఉన్న ప్లానేంటి?

జైలు నుంచి వచ్చాక.. ఆర్యన్ ఏం చేయబోతున్నాడు? కుమారుడి విషయంలో షారుఖ్, గౌరీ ఖాన్‌కు ఉన్న ప్లానేంటి?

Aryan khan : ఆర్యన్ ఏం చేయబోతున్నాడు? షారుఖ్, గౌరీ ఖాన్‌కు ఉన్న ప్లానేంటి?

Srk Son

Cruise Drugs Case : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు ఎట్టకేలకు.. ఊరట దక్కింది. ముంబై క్రూయిజ్ షిప్‌ డ్రగ్స్ కేసులో.. చాలా సస్పెన్స్ తర్వాత బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి ఆర్డర్స్ రాగానే.. ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఆర్యన్ ఖాన్ రిలీజ్ కానున్నాడు. దీంతో.. షారుఖ్‌ ఫ్యామిలీకి కూడా రిలీఫ్ దక్కింది. దాదాపు నెలపాటు కొడుకు బెయిల్‌ కోసం ఎదురుచూసిన షారుఖ్‌ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది.

Read More : Aryan Khan Gets Bail : సినిమా అప్పుడే అయిపోలేదన్న మాలిక్!

అసలు..ఎప్పుడెప్పుడు ఏం  జరిగింది ? :-
జైలు నుంచి వచ్చాక.. ఆర్యన్ ఏం చేయబోతున్నాడు? కుమారుడి విషయంలో షారుఖ్, గౌరీ ఖాన్‌కు ఉన్న ప్లానేంటి? ఆర్యన్‌ జైలు నుంచి రాగానే.. 2, 3 నెలల పాటు ఇంటి నుంచి బయటకు పంపించకూడదని షారుఖ్‌, గౌరిఖాన్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లేట్‌ నైట్‌ పార్టీలతో పాటు ఫ్రెండ్స్‌కు కూడా దూరంగా ఉంచనున్నారని, ఇప్పటికే నెలరోజులుగా షూటింగ్‌లకు దూరమైన షారుఖ్‌.. మరికొన్ని రోజుల పాటు బ్రేక్‌ ఇవ్వనున్నారని టాక్. అవసరమైతే కోర్టు అనుమతితో ఫ్యామిలీతో కలిసి కొన్నాళ్ల పాటు విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి.

Read More : Aryan Khan: మునుపటి లాయర్లు అసమర్థులా.. ఆర్యన్ బెయిల్‌పై ఆర్జీవీ పంచ్‌లు!

అసలు..ఎప్పుడెప్పుడు ఏం  జరిగింది ? :-

ఈ నెల రెండో తేదిన.. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాతి రోజే.. ఎన్సీబీ కస్టడీలోకి తీసుకుంది. అక్టోబర్ 4న.. ఆర్యన్ కస్టడీని 3 రోజులు పొడిగించారు. ఏడో తేదిన.. మరోసారి ఆర్యన్ కస్టడీని పొడిగించారు. 8వ తేదిన అతన్ని ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. ఇదే రోజు.. బెయిల్ పిటిషన్ వేస్తే కోర్టు తిరస్కరించింది. తర్వాత.. అక్టోబర్ 11న ముంబై సెషన్స్ కోర్టులో ఆర్యన్ తరఫు లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 13న బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేశారు. 14న అక్టోబర్ 20 దాకా తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. దీంతో.. 20వ తేదీన.. ఆర్యన్ లాయర్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

Read More : Aircraft Vadodara Restaurant: విమానం లాంటి రెస్టారెంట్.. పెట్టుబడి రూ.1.40కోట్లు

రంగంలోకి దిగిన ముకుల్ రోహత్గీ ? :-
21న జైలులో.. షారుఖ్ ఖాన్ ఆర్యన్‌ను కలిశారు. అదే రోజు బెయిల్ పిటిషన్‌పై విచారణను.. బాంబే హైకోర్టు 26వ తేదీకి వాయిదా వేసింది.ఆర్యన్‌కు ఎంతకూ బెయిల్ రాకపోవడంతో.. అక్టోబర్ 25న మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని సీన్‌లోకి దించారు షారుఖ్ ఖాన్. 3 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. బెయిల్‌ ఇవ్వకూడదని ఎన్సీబీ వాదించగా.. ఇవ్వాల్సిందేనని రోహత్గీ వాదించారు. ఆర్యన్‌పై పెట్టిన సెక్షన్లన్నీ బెయిలబుల్‌ అని చెప్పారు. కుట్ర కోణం ఉందన్న వాదనలను తోసిపుచ్చారు.

Read More : Diwali with Mi sale: దీపావళి Mi సేల్‌.. స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌లు

బెయిల్ మంజూరు :-
ఒక్క ఆర్బాజ్‌ మినహా మిగిలిన వారెవరితోనూ అతనికి పరిచయాలు లేవని.. అలాంటప్పుడు అందరూ కలిసి కుట్రపన్నారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆర్యన్‌ దగ్గర అసలు డ్రగ్స్ దొరకలేదన్నారు. ఆర్బాజ్‌ దగ్గర కొంత మొత్తంలో డ్రగ్‌ దొరికినా.. అది కమర్షియల్‌ క్వాంటిటీలో కాదన్నారు. అందువల్ల.. ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వాల్సిందేనన్నారు. చివరకు రోహత్గీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. బెయిల్‌ మంజూరు చేసింది. ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరికి కూడా బెయిల్ వచ్చిందని రోహత్గీ చెప్పారు.