Corona in Cruise: క్రూయిజ్ షిప్ లో ఒకరికి కరోనా పాజిటివ్, ఓడ నిలిపివేత

ఓడలో పని చేసే సిబ్బంది ఒకరు కరోనా భారినపడగా.. ఓడను నిలిపివేసి అందులో ఉన్న మొత్తం 2000 మంది ప్రయాణికులకు 16 మంది సిబ్బందికి పరీక్షలు జరిపారు అధికారులు

Corona in Cruise: క్రూయిజ్ షిప్ లో ఒకరికి కరోనా పాజిటివ్, ఓడ నిలిపివేత

Ship

Corona in Cruise: నూతన సంవత్సరాన్ని సముద్ర ప్రయాణంతో సరదాగా గడపాలని వెళ్లిన పర్యాటకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఓడలో పని చేసే సిబ్బంది ఒకరు కరోనా భారినపడగా.. ఓడను నిలిపివేసి అందులో ఉన్న మొత్తం 2000 మంది ప్రయాణికులకు 16 మంది సిబ్బందికి పరీక్షలు జరిపారు అధికారులు. ముంబై నుంచి గోవాకు వారాంతాల్లో పర్యాటకులతో కూడిన క్రూయిజ్ షిప్ లు తిరుగుతుంటాయి. భారీగా ఉండే ఆ ఓడల్లో సముద్రయానం చేసేందుకు పర్యాటకులు ఉత్సాహం కనబరుస్తారు. నూతన సంవత్సరంలో అలా సరదాగా గడుపుదామని వెళ్లిన పర్యాటకులకు కరోనా రూపంలో తీవ్ర నిరాశ ఎదురైంది.

Also Read: Man shot dead: ఫుడ్ సర్వ్ చేయలేదని హోటల్ యజమానిని కాల్చిచంపిన వైనం

ఓడలో పనిచేస్తున్న సిబ్బంది ఒకరు కరోనా భారిన పడ్డారు. దీంతో సిబ్బంది మొత్తానికి పరీక్షలు జరిపారు. రెండు రోజులుగా బాధితుడు ఓడలోని తిరుగాడడంతో.. ఓడలో ఉన్న మొత్తం 2000 మంది ప్రయాణికులకు పరీక్షలు జరపాలని గోవా ప్రభుత్వం సూచించింది. ఫలితం వచ్చేవరకు ప్రయాణికులు ఓడలో ఉండాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ముంబై నుంచి ప్రత్యేక వైద్య సిబ్బంది ఓడలోకి చేరుకొని.. 2016 మందికి కరోనా పరీక్షలు జరిపారు. ప్రస్తుతం ఓడను దక్షిణ గోవా పోర్ట్ సమీపంలో.. మోర్ముగావ్ పోర్ట్ క్రూయిజ్ టెర్మినల్ వద్ద నిలిపివేశారు.

Also read: Weather Update: మరికొన్ని రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే: తెలంగాణ వాతావరణశాఖ