CS Somesh kumar : హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న CS సోమేశ్ కుమార్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ నిర్ణయించారు. తెలంగాణ హైకోర్టు తీర్పుకు సంబంధించిన కాపీ సోమేశ్ కుమార్ కు అందింది. దీంతో సోమేశ్ కుమార్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు.

CS Somesh kumar : హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న CS సోమేశ్ కుమార్

Telangana CS Somesh Kumar To The Supreme Court..

CS Somesh kumar : హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ నిర్ణయించారు. తెలంగాణ హైకోర్టు తీర్పుకు సంబంధించిన కాపీ సోమేశ్ కుమార్ కు అందింది. దీంతో సోమేశ్ కుమార్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిస్తూ తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసింది. ఏపీకి వెళ్లిపోవాలంటూ హైకోర్టు ఆదేశించింది. దీంతో తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు.

తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసింది. ఏపీకి వెళ్లిపోవాలంటూ హైకోర్టు ఆదేశిస్తూ..కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. డీవోపీటీ పిటిషన్ పై హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

High Court Key Judgment : తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపు రద్దు.. ఏపీకి వెళ్లిపోవాలంటూ హైకోర్టు ఆదేశం

రాష్ట్ర విభజన సమయంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను వివిధ ప్రాంతాలకు అనగా ఏపీ, తెలంగాణకు కేటాయిస్తూ గతంలో కేంద్ర డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీని సవాల్ చేస్తూ గతంలో సీఎస్ సోమేశ్ కుమార్ తెలంగాణలోనే కొనసాగుతానంటూ కేంద్ర పరిపాలన ట్రైటునల్ (సీఏటీ)ను కోరారు. ఈ మేరకు గతంలో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సీఏటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2017లో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టు సీజే తుది తీర్పు ఇస్తూ..సీఏటీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ తీర్పు అమలుపై దాదాపు మూడు వారాల సమయం ఇచ్చింది. మొదట అభ్యర్థనను తిరస్కరించినా సోమేశ్ కుమార్ తరపు కౌన్సిల్ కోర్టును విన్నవించిన క్రమంలో ఈ తీర్పు అమలుకు మూడు వారాల సమయం ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ సోమేశ్ కుమార్ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు.