Winter Skincare Tips: చలికాలం వచ్చేసింది.. సింపుల్ టిప్స్‌తో చర్మాన్ని కాపాడుకోండిలా

నార్మల్, డ్రై, ఆయిలీ, సెన్సిటివ్, కాంబినేషన్ స్కిన్ అని. ప్రతి ఒక్క స్కిన్ టైపుకు ఒక్కో రకంగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. పట్టించుకోకుండా వదిలేస్తే స్కిన్ డ్యామేజ్ తప్పదు మరి.

Winter Skincare Tips: చలికాలం వచ్చేసింది.. సింపుల్ టిప్స్‌తో చర్మాన్ని కాపాడుకోండిలా

sKINCARE tiPS

Winter Skincare Tips: వాతావరణం ప్రభావం చర్మంపై కచ్చితంగా కనిపిస్తుంది. అలా అని పట్టించుకోకుండా వదిలేస్తే చర్మం పాడై ఇతర సమస్యలకు కూడా దారితీయొచ్చు. సమస్యకు పరిష్కారం వెతుక్కోవడం కంటే రాకుండా ఉండటమే బెటర్ అన్నట్లు చర్మం గురించి కాస్త కేర్ తీసుకుంటే చాలు. పగుళ్లు, డ్యామేజ్ లాంటి వాటి నుంచి బయటపడిపోవచ్చు.

సాధారణంగా చర్మాన్ని ఐదు రకాలుగా చెప్తుంటారు. నార్మల్, డ్రై, ఆయిలీ, సెన్సిటివ్, కాంబినేషన్ స్కిన్ అని. ప్రతి ఒక్క స్కిన్ టైపుకు ఒక్కో రకంగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. పట్టించుకోకుండా వదిలేస్తే స్కిన్ డ్యామేజ్ తప్పదు మరి. గాలిలో ఉండే పొడి వాతావరణం.. క్రమంగా చర్మంపై పొరను పగిలేలా చేస్తుంది. పొడి చర్మం ఉండేవాళ్లు మరికొంచెం కేరింగ్ తీసుకోవాలి.

* డ్రై స్కిన్ ఉండేవారు చేయాల్సినవి:
* హైడ్రేటెడ్‌గా ఉండటం.
* ఫేస్ ఆయిల్స్, మాయిశ్చరైజర్లు వాడటం.

…………………………………… : ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా… అయితే డేంజర్లో పడ్డట్టే?..

చేయకూడనివి:
బాగా రుద్దడం, అపరిశుభ్రమైన నీటితో కడగటం వంటివి చేయడం వల్ల చర్మం పొడిగా మారిపోయి దురద రావడం, ఎర్రగా మారిపోవడం వంటివి వస్తుంటాయి.
ఆల్కహాల్ తో తయారుచేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ దగ్గరకు రానివ్వకూడదు. అటువంటి వాటి వల్ల ఇరిటేషన్, చర్మం ఇంకా పొడిగా అయిపోతుంది.
వేడి నీళ్ల స్నానం తగ్గించుకోండి. చలికాలం అది వీలుకాదని అంటే గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే సరిపోతుంది. వేడి నీటితో చేయడం వల్ల ఎక్జిమా, మంట రావడం వంటివి జరుగుతుంటాయి.