Dalit Bandhu : దళిత సాధికారిత, దళితులతో సీఎం కేసీఆర్ సమావేశం

దళిత బంధుపై తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. దళితుల సామాజికాభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న ఈ పథకంపై.. 2021, జూలై 26వ తేదీ సోమవారం చర్చించనున్నారు తెలంగాణ సీఎం. ప్రథమ అవగాహన సదస్సు సీఎం అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరగనుంది.

Dalit Bandhu : దళిత సాధికారిత, దళితులతో సీఎం కేసీఆర్ సమావేశం

Dalitha Bandhu

Dalit Bandhu CM KCR : దళిత బంధుపై తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. దళితుల సామాజికాభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న ఈ పథకంపై.. 2021, జూలై 26వ తేదీ సోమవారం చర్చించనున్నారు తెలంగాణ సీఎం. ప్రథమ అవగాహన సదస్సు సీఎం అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు సమావేశం నిర్వహిస్తారు.

Read More : Tokyo Olympics : ఒలింపిక్స్‌‌లో భారత్ పాల్గొనే మ్యాచ్‌‌లు

తెలంగాణ దళిత బంధు పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై అవగాహన కల్పించనున్నారు. సమావేశానికి హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి నలుగురు చొప్పున దళితులు పాల్గొంటారు. ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున మొత్తం 412 మంది దళిత పురుషులు, మహిళలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వారితో పాటు 15 మంది రిసోర్స్‌ పర్సన్స్ పాల్గొంటారు.

Read More : Maharashtra : వర్షాల దాటికి 138 మంది మృతి.. రూ.5 వేలకోట్ల నష్టం.. ఆహారం దొరక్క అవస్థలు

హుజూరాబాద్ నుంచి హైదరాబాద్‌ వచ్చిన దళితులు.. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. 11 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎంతో సమావేశమవుతారు. దళితబంధు పథకంలోని ముఖ్య అంశాలపై చర్చించి.. సూచనలు చేయనున్నారు. పథకం విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎం వారికి అవగాహన కల్పిస్తారు. దళితబంధు పథకం రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకు ఏవిధంగా దోహదపడుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వనున్నారు సీఎం. అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి.. ఎలా ముందుకెళ్లాలి.. అనే అంశాలను ఇంటరాక్షన్ సెషన్‌లో హాజరైన వారికి సీఎం కేసీఆర్‌ వివరించి అవగాహన కల్పిస్తారు. దళిత బంధు పథకం కోసం ఎంతైనా ఖర్చు పెడతామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికల కోసమే ఈ పథకం అన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.