Dasara: దసరా ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన నాని అండ్ టీమ్..?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Dasara: దసరా ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన నాని అండ్ టీమ్..?

Date And Time Fixed For Nani Dasara Trailer Release

Dasara: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Dasara : దసరాలో నాని కో-స్టార్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

ఈ సినిమాలో నాని ఊరమాస్ అవతారం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే దసరా చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. దసరా చిత్ర ట్రైలర్‌ను మార్చి 16న రిలీజ్ చేసేందుకు చిత్ర టీమ్ ప్లాన్ చేస్తుందట.

Dasara: ప్రమోషన్స్‌తో సందడి పెంచేసిన దసరా..!

అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను చిత్ర యూనిట్ త్వరలో చేయనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాని సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దసరా చిత్ర ట్రైలర్‌ను నిజంగానే మార్చి 16న రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.