Dasara : దసరాలో నాని కో-స్టార్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’. కాగా మూవీలోని తన కో-స్టార్ ఫోటోని షేర్ చేశాడు నాని. కో-స్టార్ అంటే మనిషి అనుకుంటారేమో కాదండోయ్..

Dasara : దసరాలో నాని కో-స్టార్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

Dasara

Dasara : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’. ఈ సినిమాలో నాని రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ మూవీతో నాని పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలను, టీజర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. టీజర్ లో నాని ఊరమాస్ యాక్షన్ తో ఇరగొట్టేశాడు.

Dasara: ప్రమోషన్స్‌తో సందడి పెంచేసిన దసరా..!

దాదాపు అన్ని పాటలు, టీజర్ రిలీజ్ చేసేయడంతో నాని సెట్ లోని కొన్ని విషయాలను షేర్ చేస్తూ దసరాని ప్రేక్షకులోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల సెట్ లో నాని, కీర్తి సురేష్ షటిల్ ఆడుతున్న వీడియోని షేర్ చేశాడు. తాజాగా మూవీలోని తన కో-స్టార్ ఫోటోని షేర్ చేశాడు. కో-స్టార్ అంటే మనిషి అనుకుంటారేమో కాదండోయ్.. ఒక చిన్న కోడిపిల్ల. దసరాలో నా కో-స్టార్ అంటూ ఒక కోడిపిల్లని ఆడియన్స్ కి పరిచయం చేశాడు. అది చూసిన ఆడియన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో కీర్తి సురేష్ ని అసలు చూపించలేదు. దీంతో కీర్తి సురేష్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక టీజర్ రిలీజ్ చేస్తారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. 19వ కాలం సింగరేణి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీ పై నాని ఫుల్ కాంఫిడెన్స్ తో ఉన్నాడు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నాడు.