David Warner: డేవిడ్ వార్నర్ డబుల్ ధమాకా… మూడేళ్లుగా ఊరిస్తున్న సెంచరీ.. ఒకేసారి డబుల్ సెంచరీ చేసిన వార్నర్
దక్షిణాఫ్రికాతో, మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆటలో డేవిడ్ వార్నర్ ఈ ఘనత సాధించాడు. దీంతో దాదాపు మూడేళ్లుగా ఊరిస్తున్న టెస్టు సెంచరీని డబుల్ మార్జిన్‌తో దక్కించుకున్నాడు.
David Warner: ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎట్టకేలకు టెస్టుల్లో సెంచరీ సాధించాడు. అదీ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. దక్షిణాఫ్రికాతో, మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆటలో డేవిడ్ వార్నర్ ఈ ఘనత సాధించాడు. దీంతో దాదాపు మూడేళ్లుగా ఊరిస్తున్న టెస్టు సెంచరీని డబుల్ మార్జిన్‌తో దక్కించుకున్నాడు.
China Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నా టూరిస్టులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసిన చైనా
2020 తర్వాత, 27 టెస్ట్ ఇన్నింగ్స్‌ల అనంతరం వార్నర్ సెంచరీ చేయడం విశేషం. ఇది వార్నర్ వందో టెస్ట్ మ్యాచ్ కావడం మరో విశేషం. వందో టెస్టులో సెంచరీ సాధించిన మూడో ఆస్ట్రేలియా ఆటగాడిగా వార్నర్ నిలిచాడు. చాలా కాలంగా తనపై వస్తున్న విమర్శలకు వార్నర్ ఈ డబుల్ సెంచరీ ద్వారా సమాధానం చెప్పాడు. టెస్టుల్లో వార్నర్‌కు ఇది 25వ సెంచరీ కాగా, దీన్ని మూడో డబుల్ సెంచరీగా మార్చుకున్నాడు. ఇటీవలి కాలంలో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న చటేశ్వర్ పుజారా రికార్డును సమం చేశాడు. వందో టెస్టులో, వన్డేలో.. రెండింట్లోనూ సెంచరీ సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు వార్నర్. అలాగే ఆస్ట్రేలియా తరఫున ఏడో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. టెస్టుల్లో 8,000 పరుగుల మైలురాయిని దాటాడు.
China Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నా టూరిస్టులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసిన చైనా
సోమవారం ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ కొనసాగుతోంది. ఓపెనర్‌గా వచ్చిన డేవిడ్ వార్నర్ 254 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. అనంతరం రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. వార్నర్ తర్వాత స్టీవెన్ స్మిత్ అత్యధిక పరుగులు చేశాడు. స్మిత్ 161 బంతుల్లో 85 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి, 386 పరుగులు చేసింది. మంగళవారం రెండో రోజు ఆట ముగిసింది.