Sri Chinna Jeeyar Swamy : అంగరంగ వైభవంగా రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు.. నేటి కార్యక్రమాలు

శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. 12వ రోజు 2022, ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం ఉదయం 6.30 గంటలకు అష్టాక్షరీ మంత్ర...

Sri Chinna Jeeyar Swamy : అంగరంగ వైభవంగా రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు.. నేటి కార్యక్రమాలు

Sriramanuja

Updated On : February 13, 2022 / 7:45 AM IST

Statue of Equality : జయజయ రామానుజ, జై శ్రీమన్నారాయణ నామస్మరణతో ముచ్చింతల్ లో ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీరామనగరంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు మహావైభవంగా సాగుతున్నాయి. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో..శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. 12వ రోజు 2022, ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం ఉదయం 6.30 గంటలకు అష్టాక్షరీ మంత్ర పఠనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

Read More : Mahesh Babu : పైరసి అనేది ఎంత ఘోరమైన విషయమో వాడికి తెలియాలి.. ‘సర్కారు వారి పాట’ సాంగ్ లీక్‌పై స్పందించిన తమన్

ఉదయం 7.30 గంటలకు శ్రీరామ పెరుమాళ్ స్వామికి ప్రాతకాల ఆరాధన.
ఉదయం 8 గంటలకు శ్రీ శ్రీరామ పెరుమాళ్ కు పుష్పార్చన
ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ మహా యజ్ఞం
ఉదయం 9.05 108 దివ్య దేశాలలోని 20 ఆలయాల్లో ఉత్సవమూర్తుల ప్రాణప్రతిష్ట
ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఇష్టి

Read More : ISRO : PSLV సీ52 రాకెట్‌ కౌంట్ డౌన్ స్టార్ట్, రేపే ప్రయోగం

మధ్యాహ్నం 12.30కి పూర్ణాహుతి
సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ మహా యజ్ఞం
రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి

Read More : Telangana : కాషాయ పార్టీపై కేసీఆర్ గర్జన.. కేంద్ర ప్రభుత్వ అవినీతి చిట్టా ఉంది

సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న రాష్ట్రపతి
సాయంత్రం 3.30 గంటకు శ్రీరామనగరానికి రాష్ట్రపతి
20 నిమిషాల పాటు 108 దివ్య దేశాల సందర్శన
3.50 గంటలకు 120 కిలోల శ్రీరామానుజ స్వర్ణమూర్తి ఆవిష్కరణ
4.05 గంటలకు సమతామూర్తి దర్శనం

Read More : Mohan Babu : జీవితంలో రిస్కులు చేయాలి.. ఒక్క పాట కోసం చాలా ఖర్చుపెట్టాం

4.20 గంటలకు ఆడిటోరియం చేరుకోనున్న రాష్ట్రపతి
4.25 చిన్నజీయర్ స్వామి స్వాగత ఉపన్యాసం
సాయంత్రం 4.35 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం
సాయంత్రం 4.50 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సత్కారం
సాయంత్రం 5.00 గంటలకు ఎయిర్ పోర్టు బయలుదేరనున్న రాష్ట్రపతి