Mahesh Babu : పైరసీ అనేది ఎంత ఘోరమైన విషయమో వాడికి తెలియాలి.. ‘సర్కారు వారి పాట’ సాంగ్ లీక్‌పై స్పందించిన తమన్

తమన్ ఈ పాట లీక్ పై స్పందిస్తూ.. ''మనసైతే చాలా బాధగా ఉంది. ఆరు నెలలుగా ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డాం. రాత్రి, పగలు పని చేశాం. లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ రికార్డింగ్....

Mahesh Babu : పైరసీ అనేది ఎంత ఘోరమైన విషయమో వాడికి తెలియాలి.. ‘సర్కారు వారి పాట’ సాంగ్ లీక్‌పై స్పందించిన తమన్

Sarkaru Vaari Paata :  సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సమ్మర్ కి వాయిదా పడింది. పరుశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని వాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న విడుదల చేయాలని భావించారు.

ఇందుకు సంబంధించిన ఆ సాంగ్ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. కళావతి అంటూ సాగే ఈ పాట ప్రోమో అభిమానుల్ని మెప్పించింది. అయితే సాంగ్ రిలీజ్ అయ్యే లోపే బయటకి లీక్ అయింది. దీంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థకి మరో తల నొప్పి ఎదురయ్యింది. దీనిపై మహేష్ అబిమానులు చాలా కోపంగా ఉన్నారు. ఈ సాంగ్ ముందే లీక్ అవ్వడంతో ‘సర్కారు వారి పాట’ సినిమా సంగీత దర్శకుడు తమన్ స్పందించాడు. తమన్ దీనిపై మాట్లాడుతూ ఓ వాయిస్ మెసేజ్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

తమన్ ఈ పాట లీక్ పై స్పందిస్తూ.. ”మనసైతే చాలా బాధగా ఉంది. ఆరు నెలలుగా ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డాం. రాత్రి, పగలు పని చేశాం. లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ రికార్డింగ్ కి పని చేసిన వాళ్ళు, డైరెక్టర్, నిర్మాత దీనికోసం పెట్టిన డబ్బులు.. ఇలా చాలా.. మా అందరి కష్టం ఈ సాంగ్. ఈ పాట రికార్డింగ్ సమయంలో 9మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మేము మా హీరోగారికి చూపించిల్సిన ప్రేమ, మా అభిమానం అంతా ఈ పాటలో చూపించాము. అద్భుతమైన లిరిక్స్‌ వచ్చాయి. మా డైరెక్టర్‌ గారు ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఈ లిరికల్‌ వీడియోని తయారు చేశారు. మేం ఎంతో హ్యాపీగా ఈ పాట కోసం వరల్డ్‌లోనే బెస్ట్‌ ప్లేస్‌, మాస్టరింగ్‌, మిక్సింగ్‌ టెక్నాలజీ వాడాం.

Allu Arjun : తగ్గని పుష్ప క్రేజ్.. మార్కెట్‌లోకి ‘పుష్ప’ చీరలు..

అలా ఎంతో కష్టపడి తయారు చేసిన పాటను ఎవడో చాలా ఈజీగా నెట్‌లో పెట్టేశాడు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. వాడికి పనిస్తే వాడు మాకు ఈ పని చేస్తాడని అనుకోలేదు. గుండె తరుక్కుపోతోంది. కోపంగా వుండాలా, బాధ పడాలా, మూవ్‌ఆన్‌ అవ్వాలా తెలియట్లేదు. ఎంతో హార్ట్‌ బ్రేకింగా వుంది. నేను అస్సలు ఇంత హార్ట్‌ బ్రేక్‌ అవ్వను, చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. లైఫ్ లో ఎన్నో ఎదురుకున్నాను. నేను ఇలా పబ్లిక్‌ డొమైన్‌లో ఈ ఆడియో నోట్‌ ఎందుకు పెడుతున్నానంటే వాడికి అర్ధం కావాలి, ఈ వీడియో లీక్ చేసినోడికి పైరసీ అనేది ఎంత గోరమైన విషయమో వాడికి తెలియాలి” అంటూ తన ఆవేదనని ట్వీట్‌ ద్వారా తెలిపాడు.

Allu Arjun : జ్యోతిష్కుల వద్దకు బన్నీ.. కెరీర్ సాఫీగా సాగాలంటే ఈ హోమాలు చేయాల్సిందే..

ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాట ముందుగానే లీక్ అవ్వడంతో వాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న విడుదల అవ్వాల్సిన కళావతి పూర్తి లిరికల్ పాటను ఇవాళే అధికారికంగా యూట్యూబ్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.