Dead Man Gets Vaccine : మే నెలలో చనిపోయిన వ్యక్తికి..డిసెంబర్ లో వ్యాక్సిన్ సెకండ్ డోసు

ఈ ఏడాది మే నెలలో మరణించిన ఓ వ్యక్తికి డిసెంబర్-3,2021న కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేశారు అధికారులు. వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ డౌన్​లోడ్​ చేసుకోవాలని అతడి ఫోన్ కు ఓ సందేశం కూడా

Dead Man Gets Vaccine : మే నెలలో చనిపోయిన వ్యక్తికి..డిసెంబర్ లో వ్యాక్సిన్ సెకండ్ డోసు

Vaccine2

Dead Man Gets Vaccine :  ఈ ఏడాది మే నెలలో మరణించిన ఓ వ్యక్తికి డిసెంబర్-3,2021న కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేశారు అధికారులు. వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ డౌన్​లోడ్​ చేసుకోవాలని అతడి ఫోన్ కు ఓ సందేశం కూడా పంపారు. చనిపోయిన వ్యక్తి రెండో డోసు తీసుకోవటం ఏంటని ఆలోచిస్తున్నారా? ఈ అసాధ్యాన్ని మధ్యప్రదేశ్​ రాజ్ ఘడ్ జిల్లా యంత్రాంగం సుసాధ్యం చేసి చూపించింది.

మధ్యప్రదేశ్ లోని బియోరా టౌన్ కి పురుషోత్తం శక్యవార్​(78) ఈ ఏడాది మే నెలలో ఈ ఏడాది ఏప్రిల్ 8న కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాడు. అయితే, అనారోగ్య కారణాలతో ఇండోర్ లోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ మే-24న పురుషోత్తం మృతి చెందాడు. తాజాగా డిసెంబర్ 3న పురుషోత్తం సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆయన పేరుపై ఉన్న సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అది చూసిన కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేయగా.. అందులో రెండు డోసులు పూర్తి అయినట్లు ఉంది. ఈ విషయాన్ని డిస్ట్రిక్ట్ వ్యాక్సినేషన్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లగా.. కంప్యూటర్ ఎర్రర్ కారణంగా ఇలా జరిగి ఉండవచ్చని చెప్పారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు.

మరోవైపు, వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది ఫోన్​ నంబర్లను తప్పుగా నమోదు చేస్తున్నారని, అది కూడా ఓ కారణం కావొచ్చని బియోరా బ్లాక్​ మెడికల్​ అధికారి తెలిపారు.

ALSO READ Covid-19 In India : ఆ జిల్లాల్లో కర్ఫ్యూ విధించండి..రాష్ట్రాలకు కేంద్రం లేఖ