హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి..ప్రధానికి కపిల్ సిబల్ విజ్ణప్తి

రోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి(హెల్త్‌ ఎమర్జెన్సీ) ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ కోరారు.

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి..ప్రధానికి కపిల్ సిబల్ విజ్ణప్తి

Health Emergency

Health Emergency కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి(హెల్త్‌ ఎమర్జెన్సీ) ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ కోరారు. అలాగే, ఎన్నికల ప్రచార ర్యాలీలపై తాత్కాలికంగా నిషేధం విధించాలని ఎన్నికల సంఘానికి ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.

కొవిడ్​ 19తో కోలుకున్నవారి కన్నా వేగంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. మోదీజీ.. జాతీయ ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించండి. ఎన్నికల సంఘం.. ప్రచార ర్యాలీలపై తాత్కాలిక నిషేధం విధించాలి. కోర్టులు ప్రజల ప్రాణాలను రక్షించాలి అని ఆదివారం కపిల్ పిబల్ ఓ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా, దేశంలో వరుసగా నాలుగో రోజూ 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,61,500 కరోనా పాజిటివ్‌ కేసులు, 1,501 మరణాలు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,47,88,109కు చేరగా.. 1,28,09,643 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 1,77,150 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 18,01,316 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్​డౌన్​ సహా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి.