Bollywood : దీపికా పదుకొనే డ్రీం ప్రాజెక్టు ‘ద్రౌపది’ త్వరలో..

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక తన తర్వాతి సినిమాలతో పాటు తన డ్రీం ప్రాజెక్టు పై స్పందించింది. గతంలోనే తన కలల ప్రాజెక్టు గురించి కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పింది. భారీ బడ్జెట్‌తో....

Bollywood : దీపికా పదుకొనే డ్రీం ప్రాజెక్టు ‘ద్రౌపది’ త్వరలో..

Deepika

 

Deepika Padukone :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే అనన్య పాండేతో కలిసి నటించిన ‘గెహ్రాయాన్’ సినిమా అమెజాన్ లో రిలీజ్ అయింది. ప్రస్తుతం దీపిక షారుఖ్‌ ఖాన్‌తో కలిసి ‘పఠాన్‌’లో నటిస్తున్నారు. మరో పక్క ప్రభాస్ తో కలిసి ‘ప్రాజెక్టు K’లో నటిస్తున్నారు. త్వరలో హృతిక్‌ రోషన్‌తో కలిసి ‘ఫైటర్‌’ సినిమాలో నటించనున్నారు.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక తన తర్వాతి సినిమాలతో పాటు తన డ్రీం ప్రాజెక్టు పై స్పందించింది. గతంలోనే తన కలల ప్రాజెక్టు గురించి కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పింది. భారీ బడ్జెట్‌తో మైథలాజికల్‌ సినిమా ‘ద్రౌపది’ని తెరకెక్కించాలని దీపిక ఎప్పట్నుంచో అనుకుంటుంది. దీపిక మెయిన్ లీడ్ లో ‘ద్రౌపది’ సినిమాని 2019లోనే అనౌన్స్ చేశారు.

Durgavva : ‘భీమ్లా నాయక్’ సినిమాలో ‘అడవితల్లి..’ పాటకి దుర్గవ్వ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఈ సినిమా గురించి దీపిక మాట్లాడుతూ.. ” నా కలల ప్రాజెక్టు తప్పకుండా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్‌ కే చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది షూటింగ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.” అని తెలిపింది. దీంతో మరో భారీ మైథలాజికల్ సినిమా త్వరలోనే రానున్నట్లు తెలుస్తుంది.