Deepika Padukone : ఒకప్పుడు కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భారత్‌కి ఇంత ప్రాధాన్యత లేదు.. దీపికా పదుకొనే వ్యాఖ్యలు..

దీపికా అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ''అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో భారతీయ సినిమాలకు ఇప్పుడున్నంత ప్రాధాన్యత ఒకప్పుడు ఉండేది కాదు. దేశీయ చిత్ర పరిశ్రమ.................

Deepika Padukone : ఒకప్పుడు కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భారత్‌కి ఇంత ప్రాధాన్యత లేదు.. దీపికా పదుకొనే వ్యాఖ్యలు..

Deepika (2)

Cannes 2022 :  గత కొద్ది రోజులుగా భారత సినిమాల గురించి, భారత సినీ పరిశ్రమ గురించి ప్రపంచమంతటా మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా భారతదేశానికి, మన సినిమాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సారి ఏకంగా భారతదేశానికి గౌరవ సభ్యదేశం హోదా ఇవ్వడంపై అందరూ ఆనందించారు. అంతేకాక ఈ సారి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యురి మెంబర్స్ లో దీపికా పదుకొనే ఒకరిగా ఉంది. చాలా మంది ఇండియన్ తారలు రెడ్ కార్పెట్ పై నడిచి భారత సినీ పరిశ్రమ గౌరవాన్ని మరింత పెంచారు.

తాజాగా దీపికా అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ”అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో భారతీయ సినిమాలకు ఇప్పుడున్నంత ప్రాధాన్యత ఒకప్పుడు ఉండేది కాదు. దేశీయ చిత్ర పరిశ్రమ ఒక్కటిగా సాధించిన విజయం ఇది. ప్రతిష్టాత్మక ఈ కాన్స్ చిత్రోత్సవాల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రోత్సవాలకు 75 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఒకప్పుడు భారత సినిమాలకు ఇంత ప్రాముఖ్యత లేదు. ఆహ్వానం అందుకున్న సినీ తారలు కూడా తక్కువే. కానీ ఇవాళ కాన్స్ లో భారతీయ సినిమా పతాకం ఎగురుతుంది. మనమంతా ఐక్యంగా సాధించిన విజయమిది. మన సినిమా ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి” అని భారతీయుల్ని ఉద్దేశించి మాట్లాడింది.

Rashmika Mandanna : విజయ్‌కి అందరి ముందు దిష్టి తీశాను అంటున్న హీరోయిన్..

ఈసారి కాన్స్ చిత్రోత్సవాల్లో దీపికాతో పాటు తమన్నా, పూజా హెగ్డే, ఐశ్వర్య రాయ్, అదితిరావు హైదరి, నర్గిస్ ఫక్రి, హీనా ఖాన్, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, కమల్‌ హాసన్‌, ఏఆర్‌ రెహమాన్‌, ఆర్‌ మాధవన్‌.. మరి కొంతమంది పలువురు ఇండియన్ తారలు పాల్గొన్నారు.