Defence Ministry : భారత అమ్ములపొదిలోకి 118 అర్జున MK-1A ట్యాంకులు

భారత ఆర్మీ కోసం.. 118 MBT(మెయిన్​ బ్యాటిల్​ ట్యాంక్స్​)Mk-1A అర్జున ట్యాంకులు కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది.

Defence Ministry : భారత అమ్ములపొదిలోకి 118 అర్జున MK-1A ట్యాంకులు

Arjuna Tanks

Defence Ministry  భారత ఆర్మీ కోసం.. 118 MBT(మెయిన్​ బ్యాటిల్​ ట్యాంక్స్​)Mk-1A అర్జున ట్యాంకులు కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం చెన్నైకు చెందిన హెవీ వెహికిల్స్​ ఫ్యాక్టరీ(HVF)తో గురువారం రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 7,523కోట్లు.

రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఈ ఆర్డర్ మరింత ఊతమిస్తుందని మరియు ఆత్మనిర్భర్ భారత్ ని సాధించేదిశలో ఇదొక పెద్ద అడుగు అని రక్షణశాఖ పేర్కొంది. ఈ ట్యాంకర్లు సైన్యానికి అదనపు శక్తిగా నిలుస్తాయని రక్షణశాఖ తెలిపింది.

MBT Mk-1A..అర్జున్ ట్యాంక్ యొక్క కొత్త వేరియంట్ అని తెలిపింది. MK-1 వేరియంట్​తో పోల్చుకుంటే ఇందులో 72 ఫీచర్లు అదనంగా ఉంటాయని రక్షణశాఖ తెలిపింది. ఏ ప్రదేశంలోనైనా సులభంగా ప్రయాణించే వెసులుబాటు యుద్ధ ట్యాంకుల్లో ఉందని తెలిపింది.

READ Covid Second Wave : కేసులు తగ్గుతున్నా..ఇంకా సెకండ్ వేవ్ మధ్యలోనే ఉన్నాం