Dehradun : నా ‘పిలక’ పోయింది సార్..పండిట్ ఫిర్యాదు..కేసు నమోదు

ఓ పంతులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ..సార్ నా ‘పిలక’పోయింది’ అంటూ ఫిర్యాదు చేశాడు. అది విన్న పోలీసులు షాక్ అయ్యారు. తరువాత పూర్తి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Dehradun : నా ‘పిలక’ పోయింది సార్..పండిట్ ఫిర్యాదు..కేసు నమోదు

Barber Cut Braids Of Pandit Case Lodged In Dehradun

barber cut braids of pandit case lodged : పౌరోహిత్యం చేసే పంతుళ్లు సంప్రదాయంగా తలపై పిలక ఉంచుకుంటారు. తలంతా గుండు చేయించుకుంటారు కానీ పిలక మాత్రం ఉంచుకుంటారు. ఆ పిలకకు చివరలో ముడి కూడా వేస్తారు. ఇదిలా ఉంటే ఓ పండిట్ గుండు మీద హెయిర్ పెరగటంతో కటింగ్ కోసం సెలూన్ షాపుకు వెళ్లాడు. కట్టింగ్ కోసం వెళ్లినప్పుడు బార్బర్ కు తన పిలక గురించి చెబుతూ ‘ నా పిలక జాగ్రత్త ఏమాత్రం కట్ అవ్వకుండా మిగత తలంతా కటింగ్ చెయ్యి’ అని చెప్పాడు. సరే అన్నాడు బార్బర్. కానీ పొరపాటున బార్బర్ పండిట్ గారి పిలక కట్ చేసేశాడు. దీంతో పండిట్ మండిపడిపోయారు. హారి బడవా..నేను చెబుతూనే ఉన్నాను..నా పిలక జాగ్రత్త అని కానీ అన్నంత చేశావు కదారా..అంటూ మండిపడిపోయాడు. అగ్గిమీద గుగ్గిలం అయిపోతూ..నీ పని చెబుతానుండు అంటూ గబగబా పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా పిలక పోయింది సార్ అంటూ ఫిర్యాదు చేశాడు సదరు పండిట్. ఈ వింత ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది.

పండిట్ గారి పిలక కేసు గురించి..ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని కోట్నాలాకు చెందిన నివసించే శివానంద్ అనే పండిట్ ఆ ప్రాంతంలోనే ఓ బార్బర్ షాపునకు వెళ్లి తన పిలక కట్ చేయకుండా కట్టింగ్ చేయమని చెప్పాడు. సరేనన్న బార్బర్ పొరపాటున పిలక కూడా కట్ చేసేసాడు. తరువాత పొరపాటు గ్రహించాడు. కానీ మెదలకుండా ఊరుకున్నాడు.

కానీ కట్టింగ్ పూర్తి అయ్యాక అద్దంలో చూసుకున్న శివానంద్ తన పిలక కట్ అయిన విషయం గుర్తించాడు. అంతే బార్బర్ తో నేను నీకు ముందే చెప్పాను కదా..ఇలా చేశావేంటీ? అని ప్రశ్నించాడు. దానికి బార్బర్ తాను చేసింది పొరపాటు అని తెలుసుకుని కూడా పండిట్ పై ఎదురు గొడవకు దిగాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు..‘హా ఏంటీ పిలక కట్ అయితే ఏదో ఘోరం జరిగినట్లుగా మాట్లాడుతున్నావ్..మళ్లీ పెరుగుదద్దిలే’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేసరికి పంతులికి ఒళ్లు మండిపోయింది. చేసింది తప్పు అని తెలిసి కూడా ఎదురు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నావ్..మర్యాద లేకుండా అంటూ పంతులుగారు కూడా అనేసరికి ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో బార్బర్ మాట్లాడిన మాటలకు శివానంద్ మనస్తాపానికి గురై..ఆ బార్బర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు పండిట్ ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు. తరువాత పూర్తి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.