IPL 2023: మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ ఆట‌గాడు.. క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌ల్లోకి..!

ఇటీవ‌ల ఢిల్లీ జ‌ట్టులోని ఓ స్టార్ ఆట‌గాడు త‌ప్ప‌తాగి ఓ మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌కు క‌ఠిన నియ‌మ నిబంధ‌న‌ల‌ను విధించింది ఢిల్లీ క్యాపిట‌ల్స్ మేనేజ్‌మెంట్‌.

IPL 2023: మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ ఆట‌గాడు.. క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌ల్లోకి..!

Delhi Capitals Star Misbehaves With A Woman

IPL 2023: ఐపీఎల్‌(IPL)2023 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals)వరుస‌గా ఐదు ప‌రాజ‌యాల త‌రువాత కోలుకుంది. రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించి గెలుపు బాట ప‌ట్టింది. అయితే.. ఇప్పుడు ఆ జ‌ట్టుకు సంబంధించిన ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇటీవ‌ల ఢిల్లీ జ‌ట్టులోని ఓ స్టార్ ఆట‌గాడు త‌ప్ప‌తాగి ఓ మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌కు క‌ఠిన నియ‌మ నిబంధ‌న‌ల‌ను విధించింది ఢిల్లీ క్యాపిట‌ల్స్ మేనేజ్‌మెంట్‌. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్ అనంత‌రం ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఒక‌వేళ ఎవ‌రైనా వాటిని ఉల్లంఘిస్తే జ‌రిమానా లేదా కాంట్రాక్టు ర‌ద్దు చేయ‌నున్నారు.

ఓ ఆంగ్ల ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం.. ఇక‌పై రాత్రి 10 త‌రువాత ఆట‌గాళ్ల గ‌దుల్లోకి బ‌య‌టి వ్య‌క్తుల అనుమ‌తి నిషేదం. మిగ‌తా స‌మ‌యంలో కూడా ఆట‌గాళ్ల ఉన్న గ‌ద్లులోకి వెళ్లాలంటే త‌ప్ప‌ని స‌రిగా అనుమ‌తి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఢిల్లీ ప్రాంచైజీ ప్ర‌తిష్ట దెబ్బ‌తిన‌కుండా ఉండేందుకు నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

IPL 2023 DC Vs SRH : చతికిలపడిన సన్ రైజర్స్.. ఢిల్లీ కేపిటల్స్ గెలుపు

నిబంధ‌న‌లు ఇవే

-ఇక‌పై రాత్రి 10 గంట‌ల త‌రువాత ఆట‌గాళ్ల గ‌దుల్లోకి బ‌య‌టి వ్య‌క్తులు వెళ్లేందుకు అనుమ‌తి లేదు.

– ఫోటో గుర్తింపు కార్డుతో పాటు ఐపీఎల్ టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీస‌ర్ నుంచి అనుమ‌తి తీసుకున్న త‌రువాతే ఎవ‌రైనా స‌రే ఆట‌గాళ్ల‌ను క‌ల‌వాల్సి ఉంటుంది.

-ఆట‌గాళ్లు తాము బ‌స చేస్తున్న హోట‌ళ్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్లితే త‌ప్ప‌కుండా ప్రాంచైజీకి ఆ విష‌యం తెలియ‌జేయాలి.

-ఆటగాళ్ల భార్య‌ల‌కు, స్నేహితురాళ్ల‌కు ప్లేయ‌ర్స్‌తో ఉండేందుకు అనుమతి ఉన్న‌ప్ప‌టికీ వారి ఖ‌ర్చుల‌ను స‌ద‌రు ప్లేయ‌ర్లే భ‌రించాలి.

-ప్రాంఛైజీ ఏర్పాటు చేసేట‌టువంటి అన్ని కార్య‌క్ర‌మాల‌కు ఆట‌గాళ్లు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాలి.

పై నిబంధ‌న‌లు ఎవ‌రైనా ఉల్లంఘిస్తే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్నారు. స‌ద‌రు వ్య‌క్తుల లేదా ఆట‌గాళ్ల కాంట్రాక్టుల‌ను ర‌ద్దు చేయ‌నున్నారు.