Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌కు బెయిల్

సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు ఊరట లభించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 8న హైదరాబాద్ కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుని సీబీఐ అరెస్ట్ చేసింది.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌కు బెయిల్

Delhi Liquor Scam : సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు ఊరట లభించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 8న హైదరాబాద్ కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుని సీబీఐ అరెస్ట్ చేసింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో, తద్వారా హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్, రిటైల్ లైసెన్సీలకు లాభం చేకూర్చడంలో కీలకపాత్ర పోషించినందుకు గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసింది సీబీఐ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కొంతకాలం చార్టెడ్ అకౌంట్ గా బుచ్చిబాబు పని చేశారు. మద్యం విధానం రూపకల్పనలో హైదరాబాద్ కు చెందిన పలు సంస్థలకు భారీగా లబ్ధి చేకూరే విధంగా బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Also Read..Komatireddy Rajagopal Reddy : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లక తప్పదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ప్రస్తుతం తీహార్ జైల్లో బుచ్చిబాబు ఉన్నారు. లిక్కర్ స్కాంలో అంతిమ లబ్ధిదారుడు తాను కాదని, వృత్తి పరంగా మాత్రమే వ్యాపారవేత్తలతో వ్యవహరించానని, కేసు దర్యాప్తునకు సహకరిస్తున్నానని రౌస్ అవెన్యూ కోర్టును బెయిల్ కోరారు బుచ్చిబాబు. దీంతో రూ.2లక్షల పూచికత్తు మీద కోర్టు బెయిల్ ఇచ్చింది. అలాగే, పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది.

బుచ్చిబాబుకు బెయిల్ ఇవ్వడం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. బుచ్చిబాబుకు బెయిల్ ఇస్తూ.. సోమవారం ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గోరంట్ల బుచ్చిబాబును ఫిబ్రవరి 8న సీబీఐ అరెస్ట్ చేయగా.. తొలుత మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది.

Also Read..Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసిన సీబీఐ

తర్వాత రెండు సార్లు కస్టడీని పొడిగించింది. ఈ కేసులో బుచ్చిబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ గత బుధవారం కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. వాదనలు విన్న జడ్జి.. తీర్పును వాయిదా వేశారు. తాజాగా బుచ్చిబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ నుంచి అభిషేక్‌ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్ట్ చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబే. పలుమార్లు బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ, ఈడీ.. తర్వాత అరెస్ట్ చేశాయి. ఇటీవల వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు మాగుంట రాఘవ రెడ్డి కూడా అరెస్టయ్యారు. ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.