Monkeypox Case: విదేశాలకు వెళ్లకపోయినప్పటికీ వ్యక్తికి మంకీపాక్స్

ఢిల్లీలో విదేశాలకు వెళ్లకపోయినప్పటికీ 31 ఏళ్ల వ్యక్తిలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో ఇండియాలో నాలుగో మంకీపాక్స్ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. గతంలో మూడు కేసులు కేరళలో నమోదయ్యాయి.

Monkeypox Case: విదేశాలకు వెళ్లకపోయినప్పటికీ వ్యక్తికి మంకీపాక్స్

Monkeypox

 

 

Monkeypox Case: ఢిల్లీలో విదేశాలకు వెళ్లకపోయినప్పటికీ 31 ఏళ్ల వ్యక్తిలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో ఇండియాలో నాలుగో మంకీపాక్స్ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. గతంలో మూడు కేసులు కేరళలో నమోదయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో జరిగిన పార్టీకి ఆ వ్యక్తి అటెండ్ అయ్యాడు. అతనితో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారనే దానిపై డైరక్టరేట్ జనరల్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ విచారణ జరుపుతుంది.

కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో ఆ వ్యక్తి మూడ్రోజుల క్రితమే హాస్పిటల్ లో చేరాడు. అతని శాంపుల్స్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఢిల్లీలో మంకీపాక్స్ కేసు నమోదైనట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కన్ఫామ్ చేశారు. ఎవరూ భయాందోళనకు గురికావొద్దని పిలుపునిచ్చారు.

“ఢిల్లీలో తొలి మంకీపాక్స్ నమోదైంది. పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉంది. పరిస్థితి అదుపులోనే ఉంది.. రికవరీ అవుతున్నాడు. అతని కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశాం. ఢిల్లీవాసుల్లో వ్యాప్తి కలగకుండా మా టీం అత్యుత్తమంగా పనిచేస్తుంది” అని కేజ్రీవాల్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

Read Also: దేశంలో మ‌రో మంకీపాక్స్ కేసు న‌మోదు

“రెండ్రోజుల క్రితం ఆ వ్యక్తిని హాస్పిటల్ లో అడ్మిట్ చేశాం. అతనికి జ్వరంతో పాటు చర్మంపై చిన్నపాటి పొక్కులు కనిపించాయి. అబ్జర్వేషన్ లో ఉంచి అతని శాంపుల్స్ ను పూణెకు పంపించాం. అతనికి మంకీపాక్స్ సోకినట్లు కన్ఫామ్ అయింది. ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నాం” అని ఎల్ఎన్జేపీ హాస్పిటల్ డైరక్టర్ సురేశ్ కుమార్ చెబుతున్నారు.