Monkeypox: దేశంలో మ‌రో మంకీపాక్స్ కేసు న‌మోదు

ఢిల్లీలో 34 ఏళ్ళ‌ వ్య‌క్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని అధికారులు తెలిపారు. ఆ వ్య‌క్తికి విదేశాల్లో ప‌ర్య‌టించిన చ‌రిత్ర కూడా లేద‌ని చెప్పారు. అత‌డిని మౌలానా అజాద్ మెడిక‌ల్ కాలేజీలో చేర్చించిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా పేర్కొంది.

Monkeypox: దేశంలో మ‌రో మంకీపాక్స్ కేసు న‌మోదు

Monkeypox

Monkeypox: దేశంలో మ‌రో మంకీపాక్స్ కేసు న‌మోదైంది. ఢిల్లీలో 34 ఏళ్ళ‌ వ్య‌క్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని అధికారులు తెలిపారు. ఆ వ్య‌క్తికి విదేశాల్లో ప‌ర్య‌టించిన చ‌రిత్ర కూడా లేద‌ని చెప్పారు. అత‌డిని మౌలానా అజాద్ మెడిక‌ల్ కాలేజీలో చేర్చించిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా పేర్కొంది. అత‌డు జ్వరం, చ‌ర్మంపై ద‌ద్దుర్లతో బాధ‌ప‌డ్డాడ‌ని, దీంతో శాంపిళ్ళ‌ను పూణెలోకి నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ వైరాల‌జీకి పంప‌గా మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని అధికారులు వివ‌రించారు.

అత‌డు ఇటీవ‌లే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మ‌నాలీలో ఓ పార్టీలో పాల్గొని వ‌చ్చాడ‌ని చెప్పారు. అత‌డిని ఇటీవ‌ల ఎవ‌రెవ‌రు కలిశార‌న్న విష‌యంపై ఆరా తీస్తున్నామ‌న్నారు. కేర‌ళ‌లో ఇప్ప‌టికే ముగ్గురికి మంకీపాక్స్ పాజిటివ్ నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. ఢిల్లీలో తాజాగా న‌మోదైన కేసుతో దేశంలో మంకీపాక్స్ కేసు సంఖ్య నాలుగుకి చేరింది. కాగా, మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తోందని నిన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఓ ప్ర‌క‌ట‌న చేసింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. ఇప్ప‌టికే 75 దేశాల్లో దాదాపు 16,000 మంకీపాక్స్ కేసులు వెల్లడయ్యాయి.