Sir Movie: ధనుష్ ‘సార్’ మనసు మార్చుకున్నాడా.. మళ్లీ అదే బాటలో..?

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘వాతి’ తెలుగులో ‘సార్’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండటంతో, తమిళనాడుతో పాటు ఈ సినిమాపై తెలుగునాట కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఇప్పుడు ధనుష్ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Sir Movie: ధనుష్ ‘సార్’ మనసు మార్చుకున్నాడా.. మళ్లీ అదే బాటలో..?

Dhanush Sir Movie Release To Postpone Again

Sir Movie: తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘వాతి’ తెలుగులో ‘సార్’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండటంతో, తమిళనాడుతో పాటు ఈ సినిమాపై తెలుగునాట కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dhanush Sir Movie: సార్ రిలీజ్ డేట్ లాక్ చేసారు!

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ఇటీవల చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాను డిసెంబర్ 2ప ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగులోనూ అదిరిపోయే సక్సెస్ దక్కుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఇప్పుడు ధనుష్ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

SIR Movie: పాఠం కాదు.. గుణపాఠం చెబుతున్న సార్!

సార్ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మరోసారి మార్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. ఈ సినిమాను డిసెంబర్ నుండి ఏకంగా ఫిబ్రవరి నెలకు మార్చాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకున్నారట. అయితే జనవరిలో సంక్రాంతి బరిలో పలు బడా సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉండటంతో, సార్ చిత్రాన్ని ఏకంగా ఫిబ్రవరి నెలకు వాయిదా వేయాలని సార్ యూనిట్ సిద్ధమవుతోందట. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ మరోసారి అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.