Dil Raju : తండ్రి కాబోతున్న నిర్మాత దిల్‌రాజు ?

గతంలో దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో కరోనా లాక్ డౌన్ సమయంలో రెండో వివాహం చేసుకున్నారు. దిల్‌ రాజుకు ఇప్పటికే................

Dil Raju : తండ్రి కాబోతున్న నిర్మాత దిల్‌రాజు ?

Dil Raju

Dil Raju :  డిస్ట్రిబ్యూటర్ గా ప్రయాణం మొదలు పెట్టి, నైజాం అగ్ర డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగి, దిల్ సినిమాతో నిర్మాతగా మారి ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించి ఇప్పుడు తన 50వ సినిమాని రామ్ చరణ్ తో నిర్మిస్తున్నారు.

గతంలో దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో కరోనా లాక్ డౌన్ సమయంలో రెండో వివాహం చేసుకున్నారు. దిల్‌ రాజుకు ఇప్పటికే ఓ కుమార్తె ఉన్నారు. తన తల్లి మరణానంతరం కుమార్తె హన్షిత రెడ్డి, బంధువుల కోరిక మేరకు కరోనా లాక్ డౌన్ సమయంలో తేజస్విని రెడ్డిని వివాహం చేసుకున్నారు. రెండో వివాహం అనంతరం లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ దంపతులు.

RRR: అమెరికాలో తారక్ క్రేజ్.. ‘జై ఎన్టీఆర్-ఆర్ఆర్ఆర్’ కార్ ర్యాలీ!

అయితే తాజా వార్తల ప్రకారం దిల్ రాజు భార్య తేజస్విని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ జంట ఓ బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. తాజాగా పలు మీడియాలలో ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే ఈ విషయం పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.