Almond Tea : బాదం టీతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా!..

బాదం టీ శరీరంలో కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటతోపాటు, ఎల్ డిఎల్ ను తగ్గించటంలో ప్రభావ వంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. బాదం టీ తరచు తాగేవాళ్ళల్లో గుండెజబ్బుల ప్రమాదం

Almond Tea : బాదం టీతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా!..

Almonds Tea

Almond Tea : ప్రతిరోజు టీ తాగటం చాలా మందికి అలవాటు, దీనివల్ల అలసట లేకుండా చురుకుగా ఉండవచ్చని  బావిస్తుంటారు. తేయాకు టీ, గ్రీన్ టీని ఇలా వివిధ రకాల టీలను తాగుతుంటారు. అయితే శరీరానికి మంచి పోషకాలనందించే బాదం టీ తాగేందుకు ఇటీవలి కాలంలో అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. బాదం గింజలు శరీరానికి అవసరమైన అధిక పోషకాలను అందిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి.

బాదం టీని ప్రతిరోజు తీసుకోవటం ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ ఇ అధికంగా అందుతుంది. రక్తంలో చక్కెర స్ధాయిలని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రిస్తుంది. శరీరంలోని మెటబాలిక్ సిండ్రోమ్ మెరుగుపడేందుకు దోహదం చేస్తుంది. నిత్యం బాదం టీ తాగటం వల్ల వృధ్ధాప్య ఛాయలు తగ్గుతాయని పలు పరిశోధనల్లో తేలింది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాల ఆక్సిడేటివ్ డ్యామేజ్ ను తగ్గించటంలో సహయపడాతాయి.

బాదం టీ శరీరంలో కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటతోపాటు, ముఖ్యంగా ఎల్ డిఎల్ ను తగ్గించటంలో ప్రభావ వంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. బాదం టీ తరచు తాగేవాళ్ళల్లో గుండెజబ్బుల ప్రమాదం చాలా తగ్గువగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ స్ధాయి తగ్గిపోతుందని పలు అధ్యయానాలు చెబుతున్నాయి. బాదం టీ తాగటం వల్ల ఆకలి తగ్గి అధిక కేలరీలు తీసుకోవటం తగ్గించేందుకు దోహదం చేస్తుంది. బాదంలో ఉండే అధిక ప్రొటీన్, ఫైబర్ శరీరానికి ఎంతగానే మేలు చేస్తాయి.

బాదం టీని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండటంతోపాటు, మంచి సువాసనను కలిగి ఉండటంతో చిన్నపిల్లలు సైతం బాదం టీ తాగేందుకు ఎక్కవ ఇష్టం చూపిస్తుంటారు. బాదం టీ తయారు చేసుకునేందుకు ముందుగా 10 బాదంపప్పులను నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పులను తొక్క తీసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో గ్రైండ్ చేసుకున్న బాదం పేస్టును వేసుకోవాలి. అందులో ఒక స్పూను షుగర్ యాడ్ చేసుకోవాలి. బాగా మరిగించిన తరువాత ఫిల్టర్ చేసుకుని టీగా తీసుకోవాలి.