Exercise : వ్యాయామం మెదడుకు మేలు చేస్తుందా?..

ఏరోబిక్ వ్యాయామాలు చేయటం వల్ల డిప్పెషన్, యాంగ్జయిటీ వంటి రుగ్మతలను తగ్గించుకోవచ్చు. ఇలాంటి వాటితో బాధపడుతున్న వారికి సాధారణంగా వైద్యులే వ్యాయామాలు చేయమని సూచిస్తుంటారు. మెదడు

Exercise : వ్యాయామం మెదడుకు మేలు చేస్తుందా?..

Exercise

Exercise : వ్యాయామం శరీరానికి ఎంతో మేలు కలిగిస్తుంది. రోజు వారి వ్యాయామాల ద్వారా కండరాలను బలోపేతం చేసుకోవటంతోపాటు, ఆరోగ్యంగా జీవించవచ్చు. వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనం కండరాలతోపాటు మెదడుకు ఎంతో మేలు కలిగిస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మెదడుకు రక్తం , ఆక్సిజన్ సరఫరా ఎక్కువ జరుగుతుంది. దీనివల్ల మెదడు కణాల ఎదుగుదలకు దోహదపడే హార్మోన్లు విడుదలవుతాయి.

రోజువారి వ్యాయామాలు చేసే వారిలో ఏకాగ్రత సామర్ధ్యం రెట్టింపవుతుంది. అనేక అధ్యయనాల్లో ఈ విషయం తేటతేలమైంది. చదువు కునే విద్యార్ధులు నిత్య వ్యాయామాలు చేయటం వల్ల వారికి చదువుపై ధ్యాసం పెరుగుతుంది. నడక , జాగింగ్ వంటి వాటిని చేయటం ద్వారా మెదడులో హిప్పోక్యాంపస్ అనే భాగం బాగా వృద్ధి చెందుతుంది. తద్వారా జ్ఞాపక శక్తి పెరిగేందుకు ఈ హిప్పోక్యాంపస్ దోహదపడుతుంది. వృద్ధాప్యంలో మతిమరుపు రాకుండా చూసుకోవచ్చు.

ఏరోబిక్ వ్యాయామాలు చేయటం వల్ల డిప్రెషన్ , యాంగ్జయిటీ వంటి రుగ్మతలను తగ్గించుకోవచ్చు. ఇలాంటి వాటితో బాధపడుతున్న వారికి సాధారణంగా వైద్యులే వ్యాయామాలు చేయమని సూచిస్తుంటారు. మెదడు కణాలు దెబ్బతినటాన్ని వ్యాయామం తగ్గిస్తుంది. నిత్యం వ్యాయామాలు చేసే వారిలో కొత్త విషయాలగురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత కూడా బాగా పెరుగుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం ఎంతగానో ఉపయోగడుతుంది.

వ్యాయామం చేయని వారిలో మతిమరుపు వంటి జబ్బులు వెలుగుచూస్తుంటాయి. అంతే కాకుండా ఉబకాయం, రక్తపోటు, కుంగుబాటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యల నుండి బయటపడాలంటే వ్యాయమం తప్పనిసరి. వ్యాయమం వల్ల గుండెతోపాటు , మెదడుకు రక్తాన్ని తీసుకువచ్చే పెద్ద రక్తనాళం, మెదడులోని సూక్ష్మ రక్తనాళాలు బలోపేతం అవుతాయి. రక్తం సరఫరాగా బాగా జరుగుతుంది.

మెదడు, శరీరం పునరుత్తేజం చేయటంలో వ్యాయామం బాగా ఉపకరిస్తుంది. నిరాశా నిస్పృహలు తగ్గిపోతాయి. ఉల్లాసం, ఉత్తేజం, ఉత్సహం పొందవచ్చు. రాత్రి సమయంలో నిద్రలేమి దూరమై ప్రశాంతమైన నిద్రకు వ్యాయామం తోడ్పతుంది. మెదడు పునరుత్తేజమై గాఢనిద్రకు అవకాశం ఏర్పడుతుంది. ప్రతిరోజు 45 నిమిషాల నుండి గంట సేపు వ్యాయామం చేస్తేనే మెదడుకు ప్రయోజనం చేకూరుతుందని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.