GalwanValleyClash : రాహుల్ జీ..రాజకీయాలు వద్దు జవాన్ తండ్రి సూచన

  • Published By: madhu ,Published On : June 20, 2020 / 07:35 AM IST
GalwanValleyClash : రాహుల్ జీ..రాజకీయాలు వద్దు జవాన్ తండ్రి సూచన

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఓ జవాన్ తండ్రి ఇచ్చిన వీడియో సందేశం వైరల్ అవుతోంది. గల్వాన్ ఘర్షణలపై రాజకీయాలు చేయొద్దని సూచించారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ లీడర్స్ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ దీనికి ఏం సమాధానం చెబుతారు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ జవాన్ తండ్రి ఎందుకు రెస్పాండ్ అయ్యారు ? దీనికి కారణం ఏంటీ అని అనుకుంటున్నారా ? దీనికి రీజన్ ఉంది.

ఇటీవలే చైనా – భారత్ సరిహద్దులో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. చైనా సైనికులు చేసిన ఈ దారుణ ఘటనపై సర్వత్రా ఆగ్రహాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. భారతీయ సైనికులను నిరాయుధులుగా పంపడం వల్లే చైనా సైనికుల చేతిలో 20 మంది సైనికులు వీరమరణం పొందారని..రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాకు చెందిన జవాన్ సురేంద్ర సింగ్ తండ్రి ఈ విషయం చెప్పారని రాహుల్..కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో సురేంద్ర సింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈయన కొడుకు..చైనా సైనికులు జరిపిన దాడిలో గాయపడ్డారని సమాచారం. 

భారత సైన్యం బలంగానే ఉందని, చైనాను ఓడించే సత్తా…ఉందని బల్వంత్ సింగ్ అన్నారు. తన కొడుకు సైన్యంలో ఒకడిగా చైనా బలగాలతో పోరాటం చేశాడనే విషయాన్నిగుర్తు చేశారు. ఇక ముందు కూడా పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై కాంగ్రెస్ ఎలాంటి సమాధానం చెబుతుందో వేచి చూడాలి. 

 

Read:  రూ. 50 వేల కోట్లతో కొత్త పథకం ప్రారంభించిన మోడీ