Rahul Gandhi: దేశంలోని నిరుద్యోగ యువ‌త‌కు అగ్నిప‌రీక్ష పెట్ట‌కండి: రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై బిహార్, ఝార్ఖండ్‌తో పాటు ప‌లు రాష్ట్రాల్లో యువ‌త పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లకు దిగిన నేప‌థ్యంలో దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.

Rahul Gandhi: దేశంలోని నిరుద్యోగ యువ‌త‌కు అగ్నిప‌రీక్ష పెట్ట‌కండి: రాహుల్ గాంధీ

Rahul Gandhi

rahul gandhi: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై బిహార్, ఝార్ఖండ్‌తో పాటు ప‌లు రాష్ట్రాల్లో యువ‌త పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లకు దిగిన నేప‌థ్యంలో దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ”ర్యాంకు లేదు, పెన్ష‌న్ లేదు, రెండేళ్ల వ‌ర‌కు ఎలాంటి ప్ర‌త్య‌క్ష నియామ‌కాలు ఉండ‌వు, నాలుగేళ్ల త‌ర్వాత ప‌రిస్థితి ఏంట‌న్న ఆందోళ‌న కూడా యువ‌త‌లో ఉంది. ఆర్మీ ప‌ట్ల గౌర‌వం లేకుండా కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది” అని రాహుల్ గాంధీ విమ‌ర్శించారు.

congress: మాపై పోలీసులు దాడి చేశారు: లోక్‌స‌భ స్పీక‌ర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

”దేశంలోని నిరుద్యోగ యువ‌త చెబుతున్న‌ స‌మ‌స్యల గురించి వినండి. వారిపై అగ్నిప‌థ్‌పై న‌డిపించి వారి స‌హ‌నానికి అగ్ని ప‌రీక్ష పెట్టొద్దు” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అగ్నిప‌థ్ ప‌థ‌కంపై కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంకా గాంధీ కూడా స్పందించారు. దేశ యువ‌త క‌ల‌ల‌ను నాశ‌నం చేయొద్ద‌ని ఆమె అన్నారు. ఆర్మీలో ప్ర‌వేశ‌పెడుతున్న ఈ నూత‌న నియామ‌కాల ప‌థ‌కం వ‌ల్ల యువ‌త‌కు ఏ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఉద్యోగ భ‌ద్ర‌త లేద‌ని, పెన్ష‌న్ రాద‌ని, ర్యాంకు ఉండ‌బోద‌ని చెప్పారు.

Akhilesh Yadav: ‘అగ్నిప‌థ్’ ప‌థ‌కం వ‌ద్దు: అఖిలేశ్ యాద‌వ్

కాగా, ఈ ప‌థ‌కంపై కేంద్ర మంత్రులు మాత్రం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తోన్న విష‌యం తెలిసిందే. దేశ యువ‌త భ‌విష్య‌త్తును, న‌వ భార‌త్‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారని వారు చెప్పుకొస్తున్నారు. దేశంలో త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో అగ్నిపథ్‌ పేరుతో కొత్త సర్వీసు పథకాన్ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో నాలుగేళ్ల కాలపరిమితితో ఈ సర్వీసు ఉంటుంది.