Akhilesh Yadav: ‘అగ్నిప‌థ్’ ప‌థ‌కం వ‌ద్దు: అఖిలేశ్ యాద‌వ్

దేశంలో త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో 'అగ్నిపథ్‌' పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త సర్వీసు పథకాన్ని ప్రారంభించిన విష‌యంపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ మండిప‌డ్డారు. కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

Akhilesh Yadav: ‘అగ్నిప‌థ్’ ప‌థ‌కం వ‌ద్దు: అఖిలేశ్ యాద‌వ్

Akhilesh Yadav

Akhilesh Yadav: దేశంలో త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో ‘అగ్నిపథ్‌’ పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త సర్వీసు పథకాన్ని ప్రారంభించిన విష‌యంపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ మండిప‌డ్డారు. కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

Supreme Court: బుల్డోజ‌ర్ల‌తో భ‌వ‌నాల‌ కూల్చివేత‌లపై స్టే ఇవ్వ‌లేం: సుప్రీంకోర్టు

”దేశ భ‌ద్ర‌త అనేది తాత్కాలిక‌, అన‌ధికార విష‌యం కాదు. ఇది చాలా ముఖ్య‌మైన, దీర్ఘ‌కాలిక విధానం. మిలిట‌రీ నియామ‌కాల్లో నిర్ల‌క్ష్య ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం అంటే మ‌న‌ దేశ, యువ‌త భ‌విష్య‌త్తును నాశ‌నం చేయ‌డ‌మే అవుతుంది” అని ‘అగ్నిప‌థ్’ ప‌థ‌కంపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగా, నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే సర్వీసును తీసుకురావ‌డం ఏంటంటూ దేశ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో నిరుద్యోగులు కూడా ఆందోళ‌నల్లో పాల్గొంటోన్న విష‌యం తెలిసిందే. ఇటువంటి ధోర‌ణి వ‌ద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి సర్వీసులతో తాము నష్టపోతామని చెబుతున్నారు.