Supreme Court: బుల్డోజ‌ర్ల‌తో భ‌వ‌నాల‌ కూల్చివేత‌లపై స్టే ఇవ్వ‌లేం: సుప్రీంకోర్టు We can't stay demolitions Supreme Court

Supreme Court: బుల్డోజ‌ర్ల‌తో భ‌వ‌నాల‌ కూల్చివేత‌లపై స్టే ఇవ్వ‌లేం: సుప్రీంకోర్టు

అక్ర‌మ భ‌వ‌నాల కూల్చివేత‌లు చ‌ట్ట ప్ర‌కార‌మే చేప‌ట్టాల‌ని, అంతేగానీ, ప్ర‌తీకార చ‌ర్య‌గా కాద‌ని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే, కూల్చివేత‌ల‌పై స్టే ఇవ్వ‌లేమ‌ని సుప్రీంకోర్టు తెలిపింది. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నుపుర్ శ‌ర్మ (బీజేపీ నుంచి స‌స్పెన్ష‌న్ ఎదుర్కొంటోన్న నాయ‌కురాలు) అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే.

Supreme Court: బుల్డోజ‌ర్ల‌తో భ‌వ‌నాల‌ కూల్చివేత‌లపై స్టే ఇవ్వ‌లేం: సుప్రీంకోర్టు

Supreme Court: అక్ర‌మ భ‌వ‌నాల కూల్చివేత‌లు చ‌ట్ట ప్ర‌కార‌మే చేప‌ట్టాల‌ని, అంతేగానీ, ప్ర‌తీకార చ‌ర్య‌గా కాద‌ని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే, కూల్చివేత‌ల‌పై స్టే ఇవ్వ‌లేమ‌ని సుప్రీంకోర్టు తెలిపింది. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నుపుర్ శ‌ర్మ (బీజేపీ నుంచి స‌స్పెన్ష‌న్ వేటు ఎదుర్కొంటోన్న నాయ‌కురాలు) అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల్లో పాల్గొన్న వారి అక్ర‌మ నిర్మాణాల‌ను యూపీ ప్ర‌భుత్వం బుల్డోజ‌ర్ల‌తో కూల్చి వేసింది.

congress: మాపై పోలీసులు దాడి చేశారు: లోక్‌స‌భ స్పీక‌ర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతోన్న ఇటువంటి కూల్చివేత‌ల‌పై వ‌చ్చిన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు గురువారం విచార‌ణ జ‌రిపింది. కూల్చివేత‌ల‌పై స‌మాధానం చెప్పాల‌ని యూపీ ప్ర‌భుత్వంతో పాటు ప్ర‌యాగ్‌రాజ్, కాన్పూర్ మునిసిప‌ల్ అధికారులకు నోటీసులు పంపింది. వ‌చ్చే మంగ‌ళ‌వారం త‌దుప‌రి విచార‌ణ జ‌రుపుతామ‌ని పేర్కొంది. అధికారులు చ‌ట్టబ‌ద్ధ ప్ర‌క్రియ‌ ప్ర‌కార‌మే న‌డుచుకోవాల‌ని చెప్పింది. కూల్చివేత‌లు అక్ర‌మ‌మ‌ని, అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌మీయ‌త్ ఉలేమా-ఎ-హింద్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డంతో ఈ మేర‌కే స‌ర్వోన్న‌త‌ న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టింది.

×