Draupadi Murmu : నేడు భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం

భారత 15వ రాష్ట్రపతిగా.. గిరిపుత్రిక ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ ముర్ము భారత నూతన రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. దీంతో యావత్ దేశమంతా ఢిల్లీ వైపే చూస్తోంది. తొలిసారి రాష్ట్రపతి పీఠం ఎక్కనున్న గిరిపుత్రిక ముర్మును చూసి గిరిజన, ఆదివాసీ సమాజమే కాదు యావత్ దేశమంతా మురిసిపోతోంది. ముర్ము ప్రమాణస్వీకారానికి.. రాష్ట్రపతి భవన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Draupadi Murmu : నేడు భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం

Murmu

Draupadi Murmu : 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సమయం వచ్చేసింది. ఆ అపూర్వ ఘడియలు దగ్గరపడ్డాయి. భారత 15వ రాష్ట్రపతిగా.. గిరిపుత్రిక ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ ముర్ము భారత నూతన రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. దీంతో యావత్ దేశమంతా ఢిల్లీ వైపే చూస్తోంది. మరికాసేపట్లో ద్రౌపది ముర్ము రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించనున్నారు. తొలిసారి రాష్ట్రపతి పీఠం ఎక్కనున్న గిరిపుత్రిక ముర్మును చూసి గిరిజన, ఆదివాసీ సమాజమే కాదు యావత్ దేశమంతా మురిసిపోతోంది.

ముర్ము ప్రమాణస్వీకారానికి.. రాష్ట్రపతి భవన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణస్వీకారానికి రాజ్యసభ ఛైర్మన్, ప్రధానమంత్రి మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రి మండలి సభ్యులు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెప్టినెంట్ గవర్నర్లు, సీఎంలు, దౌత్యాధికారుల అధిపతులు, ఎంపీలు, త్రివిధ దళాధి పతులు హాజరుకానున్నారు. అన్ని పార్టీల సభాపక్ష నేతలకు కూడా ఆహ్వాన పత్రాలను పంపించారు. బీజేపీ అగ్రనేతలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హాజరుకానున్నారు.

Droupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. యశ్వంత్ సిన్హాపై ఘన విజయం

ఉదయం 9 గంటల 17 నిమిషాలకు ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం మొదలవుతుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. ముర్ముకు స్వాగతం పలికేందుకు 9 గంటల 20 నిమిషాలకు ఆయన కమిటీ రూమ్‌ కావేరి దగ్గరకు చేరుకుంటారు. 9 గంటల 22 నిమిషాలకు ముర్ము నార్త్ కోర్ట్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత కమిటీ ఆఫ్ కావేరీ దగ్గర కోవింద్‌ ఆమెకు ఆహ్వానం పలుకుతారు.

9 గంటల 42 నిమిషాలకుకు రామ్ నాథ్ కోవింద్ తో కలిసి ద్రౌపది ముర్ము దర్బార్ హాల్ కు వెళ్లనున్నారు. 9 గంటల 49 నిమిషాలకు రాష్ట్రపతి ఫోర్‌కోర్ట్‌లోని గౌరవ వందనాన్ని రామ్ నాథ్ కోవింద్ స్వీకరించనున్నారు. 9 గంటల 50 నిమిషాలకు రాష్ట్రపతి, నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతి ఊరేగింపుగా పార్లమెంట్ కు వెళ్లనున్నారు. 10 గంటల 3 నిమిషాలకు రామ్ నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము పార్లమెంట్‌ హౌస్‌కు చేరుకుంటారు.

Draupadi Murmu : ఎవరీ ద్రౌపది ముర్ము..? టీచర్ నుంచి రాష్ట్రపతి పోటీ వరకు..ఆదివాసీ మహిళ ప్రస్థానం

10 గంటల 5 నిమిషాలకు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌కు బయలుదేరతారు. 10 గంటల 11 నిమిషాలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. 10 గంటల 14 నిమిషాలకు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 10 గంటల 23 నిమిషాలకు రాష్ట్రపతి హోదాలో ముర్ము ప్రసంగిస్తారు. పార్లమెంట్ నుంచి జాతినుద్దేశించి తొలి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు.

కొత్త రాష్ట్రపతికి గౌరవ సూచకంగా 21-గన్ సెల్యూట్ ఉంటుంది. సెంట్రల్ హాల్‌లో ప్రమాణస్వీకార వేడుక ముగిసిన తర్వాత ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు. రాష్ట్రపతి భవన్ ఫోర్‌కోర్ట్‌లో ఇంటర్-సర్వీసెస్ గార్డ్ ఆఫ్ ఆనర్ కార్యక్రమం జరుగనుంది. పదవీ విరమణ చేసిన రాష్ట్రపతికి వీడ్కోలు మర్యాదలు ఉంటాయి.