Earthquakes : అండమాన్‌లో 24 గంటల్లో మూడుసార్లు భూకంపం..

అండమాన్‌ నికోబార్‌ దీవులల్లో వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. 24 గంటల్లో మూడు సార్లు భూమి కంపించి వణికించింది. అండమాన్ లోనే కాకుండా మిజోరంలో కూడా భూమి కంపించింది.

Earthquakes : అండమాన్‌లో 24 గంటల్లో మూడుసార్లు భూకంపం..

Earthquakes Andaman and Nicobar Islands

Earthquakes : భూకంపం అనే మాట వింటేనే హడలిపోతున్న పరిస్థితి. సిరియా, టర్కీల్లో పెను బీభత్సం సృష్టించిన భూకంపాల తరువాత ఇండియాలో పలు ప్రాంతాల్లో పలు సార్లు భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. ఈ క్రమంలో అండమాన్‌ నికోబార్‌ దీవులల్లో వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఆదివారం (మార్చి 9,2023) మధ్యాహ్నం నుంచి సోమవారం తెల్లవారుజామున దాకా 24 గంటల్లో మూడు సార్లు భూమి కంపించి వణికించింది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అండమాన్ లోనే కాకుండా మిజోరంలో కూడా 4.7 తీవ్రతతో భూమి కంపించింది.

మిజోరంలో సోమవారం తెల్లవారుజామున రిక్టర్‌ స్కేలుపై 4.6 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ (ఎన్ సీఎస్)వెల్లడించింది. భూకంప కేంద్రం క్యాంప్‌బెల్‌ తీరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉందని..భూ గర్భంలో 32 కిలోమీటర్ల లోతున ప్రకంపనలు సంభవించాయని చోటుచేసుకున్నాయని వెల్లడించింది.

తర్వాత మిజోరంలోనూ ఉదయం 6.16 గంటల సమయంలో 4.7 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్ సీఎస్ తెలిపింది. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతున ప్రకంపనలు చోటుచేసుకున్నాయని, చాంఫైకి నుంచి 151 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం 2.59 గంటల ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైంది. ఆ తరువాత కేవలం గంటల వ్యవధిలోనే మరోసారి భూమి కంపించి మరోసారి హడలెత్తించింది. రెండోసారి 5.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. భూమికి 10 కి.మీ లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లుగా నేషనల్ సెంటర ఫర్ సీస్మాలజీ (NCS’ వెల్లడించింది. కాగా ఏప్రిల్ 6న కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. గత గురువారం రాత్రి 10.47 గంటలకు 5.3 తీవ్రతతో పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ దూరంలో భూమి కంపించింది. ఇలా వరుస భూకంపాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.