Green Apples : గ్రీన్ యాపిల్ తింటే.. నరాల సంబంధిత రుగ్మతలకు చెక్

క్రమం తప్పకుండా ఆపిల్ రసం తీసుకుంటే తీవ్ర సున్నితత్వం కలిగిన అలెర్జీ రుగ్మత అయిన ఆస్త్మా సమస్యను నిరోధించటానికి దోహదం చేస్తాయి.

Green Apples : గ్రీన్ యాపిల్ తింటే.. నరాల సంబంధిత రుగ్మతలకు చెక్

Green Apple

Green Apples : పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన వరం. ఆరోగ్యానికి మేలు కలిగించే అలాంటి ఆహారాల్లో గ్రీన్ ఆపిల్ ఒకటి. దీనిని రోజుకు ఒకటి చొప్పున తింటే వైద్యునితో పెద్దగా పని ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో శరీరానికి అవసరమైన పోషకాలు మరియు చాలా విటమిన్లు ఉంటాయి.

ఆపిల్స్ లో చాల రకాలు ఉన్నాయి. సాదారణంగా ఎరుపు మరియు ఆకుపచ్చ ఆపిల్స్ పుల్లని మరియు తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. గ్రీన్ యాపిల్ దీర్ఘ కాల ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది అంతర్లీన ప్రోటీన్లు, విటమిన్లు,ఖనిజాలు మరియు ఫైబర్ వంటి అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. జీర్ణవ్యవస్థ లోపాలు నుండి ఉపశమనం మరియు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించటం,బిపీ తగ్గించడం,రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడం,ఆకలి మెరుగుపరచడం వంటి వాటికి దోహదపడుతుంది.

గ్రీన్‌ యాపిల్, సాధారణ యాపిల్ పండు రంగుకు భిన్నంగా కనిపిస్తుంది. ఈ యాపిల్ పండును చూసిన చాలా మంది పచ్చి యాపిల్ గా భావిస్తారు. ఆకుపచ్చ రంగులో నిగనిగ లాడుతూ కనిపించే ఈ గ్రీన్‌ యాపిల్ ఆస్ట్రేలియాకు చెందిన యాపిల్. పండ్లలలో అన్నింటా అత్యంత అధిక ఆరోగ్యాన్ని అందించే పండు గా దీనిని చెప్తారు. సిమ్లా యాపిల్ పండులా గ్రీన్‌ యాపిల్ లో తియ్యదనము ఉండదు. కొంత వగరు రుచి కలిగి ఉంటుంది. ఈ రుచి వల్లనే దానికి ప్రత్యేకత సంతరించుకుందంటారు.

బరువు తగ్గాలని అనుకొనే వారికీ గొప్ప ఆహారం అని చెప్పవచ్చు. ప్రతి వ్యక్తీ తమ రోజు వారి ఆహారంలో తప్పనిసరిగా ఆపిల్ ఉండేలా చూసుకోవాలి. ఇది రక్తనాళాలలో కొవ్వును కరిగిస్తుంది. అంతేకాక స్ట్రోక్స్ అవకాశాలు నివారించడం,గుండెకు సరైన రక్త ప్రవాహం నిర్వహణలో సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండుట వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపర్చడానికి సహాయపడి తద్వారా జీవక్రియను పెంచుతుంది. అందువలన ఇది స్వేచ్ఛా ప్రేగు కదలికలో సహాయపడుతుంది. ఆపిల్ ను దాని చర్మంతో సహా తినటం ఎల్లప్పుడూ మంచిది. మీ ప్రేగు మరియు వ్యవస్థలను శుభ్రపర్చి మీరు సంతోషముగా మరియు ఆరోగ్యవంతులుగా ఉండటానికి సహయ పడుతుంది.

ఇనుము,జింక్,రాగి,మాంగనీస్,పొటాషియం మొదలైన ఖనిజాలను కలిగి ఉంటుంది. ఆపిల్ లో ఉన్న ఇనుము రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాక జీవక్రియ రేటు పెంచటానికి ఉపకరిస్తుంది. ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే అల్జీమర్ వంటి వృద్ధాప్య నరాల సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాన్ని అడ్డుకుంటుంది. కీళ్లవ్యాధులను నిరోధిస్తుంది. యాంటీ ఆక్సిడంట్ లు కణాల పునర్నిర్మాణం మరియు కణాల పునరుత్తేజం నకు సహాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన మరియు ప్రకాశించే చర్మ నిర్వహణలో కూడా సహాయపడతాయి. యాంటీ ఆక్సిడంట్ మీ కాలేయం రక్షించడానికి సహయపడతాయి.

క్రమం తప్పకుండా ఆపిల్ రసం తీసుకుంటే తీవ్ర సున్నితత్వం కలిగిన అలెర్జీ రుగ్మత అయిన ఆస్త్మా సమస్యను నిరోధించటానికి దోహదం చేస్తాయి. గ్రీన్ యాపిల్ లో విటమిన్ C ఉండుటవల్ల ఫ్రీ రాడికల్స్ ద్వారా చర్మ కణాలకు వచ్చే నష్టాన్నినిరోధించడంలో సహాయపడుతుంది. అందువలన చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. గ్రీన్ యాపిల్స్ మధుమేహంను నిరోధిస్తాయని పరిశోధనల్లో తేలింది. ఇది మధుమేహం ఇటీవలి కాలంలో చాలా మంది ఆహారంగా తీసుకుంటున్నారు. ఇందులో ఉండే విటమిన్ A,B మరియు Cలు ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావాల నుండి చర్మంను రక్షించటానికి, ప్రకాశవంతంగా మార్చేందుకు సహయకారిగా ఉపకరిస్తుంది.

గ్రీన్ ఆపిల్ ఆకులు మరియు దాని తొక్కతో కలిపి చేసిన పేస్ట్ చుండ్రును పరిష్కరించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఈ పేస్ట్ ను ఒక షాంపూ లాగ వాడాలి. గ్రీన్ ఆపిల్ రసంను కూడా జుట్టు లోకి క్రమం తప్పకుండా మసాజ్ చేస్తే చుండ్రు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది.