Watermelon Fruit : కర్భూజా పండు తింటే….ఆకలి పెరగటంతోపాటు ఇంకా ఎన్నో…

కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది.

Watermelon Fruit : కర్భూజా పండు తింటే….ఆకలి పెరగటంతోపాటు ఇంకా ఎన్నో…

Muskmelon

Watermelon Fruit : కర్బూజ వేసవిలో విరివిగా దొరుకుతుంది. ఈ పండు తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈఖర్బూజ పండులో అత్యధిక శాతం నీరు ఉంటుంది. వేసవి తాపం తగ్గించుకోవడానికి ఈ పండు చాలా బాగా దోహదపడుతుంది. శరీరంలోని వేడిని ఇట్టే తగ్గిస్తుంది. ఖర్బూజ పండులో ఎక్కువ శాతం బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ది చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

అధిక రక్తపోటుని తగ్గిస్తుంది.కాబట్టి చాలామంది దీన్ని తీసుకుంటూ ఉంటారు. ఇది అంత తియ్యగా ఉండదు కాబట్టి మధుమేహగ్రస్తులు దీనిని తీసుకోవచ్చు. కర్బూజలో నీటిపాళ్లతో పాటు ఖనిజ లవణాలూ ఎక్కువ. అందుకే వేసవిలో తీసుకుంటే డీహైడ్రేషన్‌ ప్రమాదం నుంచి కాపాడుతుంది. దీనిలో పీచుపదార్థాలు చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు పేగులనూ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. క్రమం తప్పకుండా జ్యూస్ తాగితే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గుతుంది.

కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే పీచు మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆకలిలేమితో బాధపడే వారికి కర్బూజ ఒక స్వాభావికమైన ఔషధంగా పనిచేసి, ఆకలిని పెంచుతుంది. అసిడిటీని అరికడుతుంది. అల్సర్‌ వంటి సమస్యలను నివారిస్తుంది. ఐరన్‌ పాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత నుంచి కాపాడుతుంది. కర్బూజలో క్యాల్షియం, పాస్ఫరస్‌ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఎముకలను దృఢపరచి, ఆస్టియోపోరోసిస్‌ వంటి అనేక వ్యాధులను నివారిస్తుంది.

ఈ పండులో అధిక మోతాదులో పొటాషియం ఉండడం వలన గుండెకు మంచి న్యూట్రియన్స్‌ని అందజేస్తుంది. దీనిలో ఫోలెట్ ఉండడం వలన గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. ఖర్బూజ పండులో విటమిన్ కె మరియు విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. అది ప్రత్యుత్పత్తి వ్యవస్థకు బాగా మేలు చేస్తుంది. కర్బూజాలో అతితక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎలాంటి అల్సర్స్ నైనా నివారించే శక్తి కర్భూజాకు ఉంది.