MLC Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు…ఆరు స్థానాలూ టీఆర్ఎస్‌కే..!

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన ఆరు శాస‌న‌మండ‌లి స‌భ్యుల ఎన్నిక‌లకు షెడ్యూల్ విడుద‌లైంది. ఆరు స్థానాలూ టీఆర్ఎస్‌కే దక్కనుండటంతో ఆశావహుల సంఖ్య పెరిగింది.

MLC Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు…ఆరు స్థానాలూ టీఆర్ఎస్‌కే..!

Mlc Elections (1)

MLC Elections in Telangana : హుజూరాబాద్ ఉప ఎన్నిక రిజల్ట్‌ రాకముందే తెలంగాణలో మరో ఎలక్షన్‌కు నగారా మోగింది. రాష్ట్రంలో ఖాళీ అయిన ఆరు శాస‌న‌మండ‌లి స‌భ్యుల ఎన్నిక‌లకు షెడ్యూల్ విడుద‌లైంది. ఆరు స్థానాలూ టీఆర్ఎస్‌కే దక్కనుండటంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. అదృష్టం ఎవరిని వహిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా పనిచేసిన ఆకుల లలిత, ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్ రావు, బోడకుంట వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి పదవీలం ఈ ఏడాది జూన్ 3తో ముగిసింది. ఆ తర్వాత కరోనా కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. తాజాగా డిసెంబర్ 1 లోపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శషాంక్‌ గోయల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది.

MLC Elections : తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి నవంబర్ 9న నోటిఫికేషన్ వెలువడనుంది. 16న నామినేషన్లను స్వీకరించనున్నారు. 17న నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. నామినేషన్ల ఉపసంహరణకు వచ్చేనెల 22 వరకు సమయమిచ్చారు. నవంబర్ 29న ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు అధికారులు. ఖాళీగా ఉన్న ఆరు స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కనుండటంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. దీంతో గులాబీ లీడర్లు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు.