Alcohol Bottles : అసెంబ్లీ ఆవరణలో మద్యం బాటిళ్లు.. సీఎం రాజీనామాకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు

సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న బీహార్ రాష్ట్రంలో.. అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం బాటిళ్లు కలకలం రేపాయి.

Alcohol Bottles : అసెంబ్లీ ఆవరణలో మద్యం బాటిళ్లు.. సీఎం రాజీనామాకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు

Alcohol Bottles

Alcohol Bottles : సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న బీహార్ రాష్ట్రంలో.. అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం బాటిళ్లు కలకలం రేపాయి. అసెంబ్లీ ప్రాంగణంలో మద్యం బాటిళ్లు కనిపించడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అధికార పార్టీ నాయకులే మద్యం సేవించి ఖాళీ సీసాలు అక్కడ పడేసి ఉంటారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. మద్యపాన నిషేదానికి కృషిచేస్తామని సీఎం నితీష్ కుమార్ చెప్పిన మరుసటి రోజే మద్యం బాటిళ్లు బయటపడటం కలకలం రేపుతోంది.

చదవండి : Bihar : ఆర్జేడీ కార్యాలయంలో 6 టన్నుల లాంతర్‌..లాలూ చేతుల మీదుగా ఆవిష్కరణ?..

దీనిపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా తీవ్రమైన అంశం. రాష్ట్రం మొత్తం మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలి. అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం బాటిళ్లు వెలుగు చూసినందుకు గాను సీఎం నితిశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.

చదవండి : Bihar : పెళ్లి మంట‌పంలో క‌ల‌క‌లం..వ‌ధువు గ‌దిలో మ‌గ పోలీసుల సోదాలు

ఇక ఈ ఘటనపై బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. ఇది తీవ్రమైన విషయమని.. స్పీకర్ అనుమతిస్తే ఈ అంశంపై దర్యాప్తు చేయమని చీఫ్ సెక్రటరీ, డీజీపీని కోరతామని తెలిపారు. కాగా బిహార్‌లోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)కి చెందిన నాలుగు పార్టీల శాసనసభ్యులు, సీఎం నితీశ్‌ కుమార్ మద్యపాన నిషేధ నిర్ణయానికి అనుకూలంగా సోమవారం తీర్మానం చేశారు. ఈ తీర్మానం జరిగిన మరుసటి రోజు ఖాళీ మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయి