Enforcement Directorate: మ‌నీలాండ‌రింగ్ కేసు.. ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ అనుచ‌రులు ఇద్ద‌రు అరెస్టు

న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ ఎదుర్కొంటోన్న ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ కేసుకు సంబంధించి అధికారులు ఇవాళ మ‌రో ఇద్ద‌రిని అరెస్టు చేశారు.

Enforcement Directorate: మ‌నీలాండ‌రింగ్ కేసు.. ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ అనుచ‌రులు ఇద్ద‌రు అరెస్టు
ad

Enforcement Directorate: న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ ఎదుర్కొంటోన్న ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ కేసుకు సంబంధించి అధికారులు ఇవాళ మ‌రో ఇద్ద‌రిని అరెస్టు చేశారు. వారిద్ద‌రు స‌త్యేంద‌ర్ జైన్ అనుచ‌రులు అంకుశ్ జైన్, వైభ‌వ్ జైన్ అని తెలిసింది. వారిద్ద‌రిని విచారించిన ఈడీ అధికారులు అనంత‌రం అరెస్టు చేశారు. ఆ తర్వాత వారిద్ద‌రినీ ఈడీ కోర్టులో అధికారులు హాజ‌రుప‌ర్చారు. వారిద్ద‌రితో పాటు ప‌లువురు స‌త్యేంద‌ర్ జైన్‌కు స‌హ‌క‌రించార‌ని ఈడీ అధికారులు చెప్పారు.

Maharashtra: 4న మ‌హారాష్ట్ర అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌కు దిగుతున్న ఏక్‌నాథ్ షిండే

స‌త్యేంద‌ర్ జైన్‌ను ఈడీ అధికారులు మే 30న అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్నారు. ఆయ‌న చేసుకున్న బెయిల్ ద‌ర‌ఖాస్తును కోర్టు తిర‌స్క‌రించింది. కాగా, న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో స‌త్యేంద‌ర్ జైన్ 2017 నుంచి విచార‌ణ ఎదుర్కొంటున్నారు. 2015-16లో కోల్‌క‌తాలోని స‌త్యేంద‌ర్ జైన్ సంస్థ‌లకు సంబంధించిన‌ న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసుల్లో ఆయ‌న‌ను ఈడీ విచారిస్తోంది. అయితే, రాజ‌కీయ క‌క్షసాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే ఆయ‌న‌పై ఈడీ విచార‌ణ జ‌రిపేలా కేంద్ర ప్ర‌భుత్వం కుట్ర ప‌న్నిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు.