Enforcement Directorate: సత్యేంద‌ర్ జైన్ ఇళ్లు, కార్యాల‌యాల్లో మ‌ళ్లీ ఈడీ సోదాలు

ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాల‌యాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు మ‌రోసారి సోదాలు జ‌రిపారు. ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో శుక్ర‌వారం ఉద‌యం ఈ దాడులు జ‌రిగాయి.

Enforcement Directorate: సత్యేంద‌ర్ జైన్ ఇళ్లు, కార్యాల‌యాల్లో మ‌ళ్లీ ఈడీ సోదాలు

Satyendra Jain

Enforcement Directorate: ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాల‌యాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు మ‌రోసారి సోదాలు జ‌రిపారు. ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో శుక్ర‌వారం ఉద‌యం ఈ దాడులు జ‌రిగాయి. న‌గ‌దు అక్రమ చ‌లామ‌ణీ నిరోధ‌క చ‌ట్టం (పీఎంఎల్ఏ)-2002 కింద ఈ సోదాలు జ‌రిపారు. ఈ నెల 6న కూడా స‌త్యేంద‌ర్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాల‌యాల్లో ఈడీ అధికారులు దాడులు చేసి రూ.2.85 కోట్ల న‌గ‌దు, 133 బంగారు నాణేల‌ను (1.80 కిలోలు) స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే.

congress: ఎంపీలపై పోలీసులు దాడి చేశారు.. ఆహారం, నీళ్లు ఇవ్వలేదు: ఖర్గే, చిదంబరం

అంత‌కుముందు చేసిన దాడుల్లోనూ ప‌లు పత్రాల‌ను ఈడీ స్వాధీనం చేసుకుంది. ప్ర‌స్తుతం స‌త్యేంద‌ర్ జైన్ 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్నారు. అంత‌కుముందు కొన్ని రోజుల పాటు ఆయ‌న ఈడీ క‌స్ట‌డీలో ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ 2017 నుంచి విచార‌ణ ఎదుర్కొంటున్నారు. 2015-16లో కోల్‌క‌తాలోని స‌త్యేంద‌ర్ జైన్ సంస్థ‌లకు సంబంధించిన‌ న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసుల్లో ఈ విచార‌ణ జ‌రుగుతోంది.