India vs England Test: చేజేతులా చేజార్చుకున్నారు.. ఇండియాపై ఇంగ్లాడ్ విక్టరీ.. సిరీస్ సమం..

టీమిండియాతో జరిగిన ఐదో టెస్టు లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జోరూట్, జానీ బెయిర్ స్టోలు శతకాలతో అదరగొట్టారు. వీరి జోడీకి చెక్ పెట్టడంలో భారత్ బౌలర్లు విఫలమయ్యారు.

India vs England Test: చేజేతులా చేజార్చుకున్నారు.. ఇండియాపై ఇంగ్లాడ్ విక్టరీ.. సిరీస్ సమం..

Indian Vs England

India vs England Test: టీమిండియాతో జరిగిన ఐదో టెస్టు లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జోరూట్, జానీ బెయిర్ స్టోలు శతకాలతో అదరగొట్టారు. వీరి జోడీకి చెక్ పెట్టడంలో భారత్ బౌలర్లు విఫలమయ్యారు. ఇంగ్లాండ్ పై భారత్ విజయం సాధిస్తుందని క్రికెట్ ప్రేమికులు భావించారు. కానీ చివరికి ఇంగ్లాండ్ చేతిలో భారత్ చిత్తైంది. ఇండియన్ బౌలర్ల పేలువ ప్రదర్శనతో సిరీస్ ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది.

Nupur Sharma: నపూర్ శర్మకు మద్దతుగా నిలిచిన రిటైర్డ్ న్యాయమూర్తులు.. సుప్రీం వ్యాఖ్యలను తప్పుబడుతూ ఎన్వీ రమణకు లేఖ

ఐదో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 132 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం కేవలం ఇండియన్ బ్యాట్స్ మెన్ 245 పరుగులకు ఆల్ అవుట్ అయ్యి నిరాశ పర్చారు. 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ తొలుత వికెట్లు కోల్పోయిరు. 109 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఓటమి అంచుకు చేరుకున్నారు. కానీ జోరూట్ (142నాటౌట్ 173 బంతుల్లో), జానీ బెయిన్ స్టో (114 నాటౌట్ 145 బంతుల్లో) అద్భుత ఆటతీరును కనబర్చి 269 పరుగులు రాబట్టారు. వీరి జోడీని విడదీయటంలో టీమిండియా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్ : 416 ఆలౌట్( పంత్ 146, జడేజా 104)
టీమిండియా రెండో ఇన్నింగ్స్ : 245 ఆలౌట్ (పుజారా 66, పంత్ 57)
ఇంగ్లాంగ్ తొలి ఇన్నింగ్స్ : 284 ఆలౌట్ (బెయిన్ స్టో 106, బిల్లింగ్స్ 36)
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 378/3 (రూట్ 142, బెయిన్ స్టో 114)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : బెయిన్ స్టో
ప్లేయర్ ఆఫ్ ది సీరిస్ : జో రూట్