Nupur Sharma: నపూర్ శర్మకు మద్దతుగా నిలిచిన రిటైర్డ్ న్యాయమూర్తులు.. సుప్రీం వ్యాఖ్యలను తప్పుబడుతూ ఎన్వీ రమణకు లేఖ

నపూర్ శర్మ.. దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం మారుమోగుతున్న పేరు. ఓ టీవీ చర్చలో మహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి.

Nupur Sharma: నపూర్ శర్మకు మద్దతుగా నిలిచిన రిటైర్డ్ న్యాయమూర్తులు.. సుప్రీం వ్యాఖ్యలను తప్పుబడుతూ ఎన్వీ రమణకు లేఖ

Supream Court

Nupur Sharma: నపూర్ శర్మ.. దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం మారుమోగుతున్న పేరు. ఓ టీవీ చర్చలో మహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నపూర్ శర్మ బీజేపీ నుంచి సస్పెండ్ కు గురైంది. ఆమె ఇటీవల సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ లన్నింటిని ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలంటూ కోరింది.

Supreme Court : దేశ ప్ర‌జ‌ల‌కు నుపుర్ శ‌ర్మ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశం..

నపూర్ శర్మ ఫిటీషన్ పై వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలాల ధర్మాసనం ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నోటి దురుసు దేశాన్ని మంటల్లోకి నెట్టిందని, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలకు నపూర్ శర్మనే కారణమంటూ పేర్కొంది. ఆమె వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలాల ధర్మాసనం ఆదేశించింది. అయితే సుప్రింకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యాలను పలువురు మాజీ న్యాయమూర్తులు, మాజీ అధికారులు, మాజీ ఆర్మీ అధికారులు తప్పుబట్టారు. ఈ మేరకు సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు బహిరంగ లేఖ రాశారు.

Supreme Court : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు

నపూర్ శర్మపై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ పర్దీవాలా చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆ వ్యాఖ్యలు దురదృష్టకరమని, మునుపెన్నడూ వినలేదని పేర్కొంటుూ 15మంది రిటైర్డ్‌ న్యాయమూర్తులు, 77మంది రిటైర్డ్‌ బ్యూరోక్రాట్స్‌, 25మంది ఆర్మీ మాజీ అధికారులు ఈ బహిరంగ ప్రకటనలో సంతకం చేశారు. ఈ లేఖలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సుప్రింకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు లక్ష్మణరేఖను దాటాయని, అందువల్లే మేం బహిరంగ ప్రకటన చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు దేశంలోపల, వెలువల అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేశాయని, న్యాయస్థానాల నుంచి ఇలాంటి దురదృష్టకరమైన వ్యాఖ్యలు రావడం అతిపెద్ద ప్రజాస్వామ్య న్యాయవ్యవస్థపై చెరగని మచ్చ వేస్తాయని వారు లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, దేశ భద్రతపై ఇవి తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశమున్నందున తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరమని సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను కోరుతూ ఈ బృందం ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి ఘటనలు సుప్రింకోర్టు పవిత్రత, గౌరవంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని మాజీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.